పెళ్లి కూతురు కియారా అద్వానీ ఫిట్ నెస్, డైట్ సీక్రేట్స్ ఏంటో తెలుసా?

Published : Feb 04, 2023, 10:42 AM ISTUpdated : Feb 04, 2023, 10:44 AM IST

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రాల ప్రేమ ప్రయాణం పెళ్లి పీటల దాకా వెళ్లింది. ఈ ప్రేమజంట వివాహం ఈ నెల 6 న జరగనుందని తెలుస్తుంది. ఈ సందర్భంగా కియారా అద్వానీ బ్యూటీ, ఫిట్ నెస్ గురించి కొన్ని ఇంట్రెట్రింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి.. 

PREV
17
 పెళ్లి కూతురు కియారా అద్వానీ ఫిట్ నెస్, డైట్ సీక్రేట్స్ ఏంటో తెలుసా?

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసిందే. ఇక ఈ ప్రేమజంట వారి ప్రేమను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అదేనండి ఈ జంట పెళ్లిపీటలు ఎక్కుబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదికూడా ఈ నెల 6 వ తేదీన. అంటే ఈ రెండు రోజుల్లో హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 6న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. మరి ఈ సందర్భంగా కాబోయే వదువు ఫిట్ నెస్ సీక్రేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

27

ప్రీ వర్కౌట్ స్ట్రెచ్

కియారా అద్వానీ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంది. కాగా ఈ బ్యూటీ వర్కౌట్ సమయంలో ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు తన శరీరాన్ని సాగదీస్తుంది. 

37

ట్రెడ్‌మిల్, వ్యాయామ బైక్

కష్టమైన వర్కౌట్స్ ను చేయడానికి ముందు కియారా హార్ట్ పంపింగ్ చేయడానికి, వ్యాయామాలకు సిద్ధంగా ఉండటానికి కొంత కార్డియో వ్యాయామం చేస్తుంది. 
 

47

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్

మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ లో కియారా సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటోంది. అన్ని రకాల ఫ్లిప్‌లు, కిక్-బాక్సింగ్ టెక్నిక్‌లను ఆమె నేర్చుకుంది.
 

57
Kiara Advani

ధ్యానం

కియారా క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుంది. ముఖ్యంగా ఈ చిన్నదానికి ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి,  ప్రశాంతంగా, స్థిరంగా ఉండటానికి ధ్యానం చేయడానికి ఇష్టపడుతుంది.
 

67

ఇంట్లో వండిన భోజనమే తింటుంది

కియారా బయటి ఫుడ్  ను తినడం చాలా చాలా తక్కువ. ఆమె ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటుంది. ముఖ్యంగా పప్పు, సబ్జీలు, ఓట్స్, దక్షిణ భారత వంటకాలతో సహా రోజూ ఇంట్లో వండిన ఆహారాన్ని తింటుంది.

77
Kiara Advani

పండ్లు

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే కియారా పండ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రోజూ రకరకాల పండ్లను తింటుంది. ముఖ్యంగా యాపిల్స్, బెర్రీలు, నారింజ వంటి పండ్లను రోజంతా పుష్కలంగా తింటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories