
మీరు పుట్టిన రోజు, తేదీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? వీటిమీద ఆధారపడే మీ జీవిత ప్రయాణం, ఉనికి సాగుతుందని న్యూమరాలజిస్ట్ లు చెబుతున్నారు. ఇది సైన్స్, న్యూమరాలజీ కళకు సంబంధంచిన అద్భుతమైన విషయం. ఈ అద్భుతమైన సైన్సే రకరకాల సందర్భాల్లో మానవజాతికి వివిధ రంగాలలో వివిధ మార్గాల్లో సహాయపడింది.
పుట్టిన తేదీలోని ప్రతి అంకె, పేరులోని ప్రతి అక్షరం కూడా చాలా ముఖ్యమైనవి. ఇందులో hidden message దాగి ఉంది. పుట్టిన తేదీలోని చివరి అంకెను బట్టి దీన్ని ఈజీగా డీకోడ్ చేయచ్చు.
'పుట్టిన తేదీ చివరి అంకె'ను ఎలా కనుగొనాలి?
మీ పుట్టిన తేదీ చివరి అంకె తెలుసుకోవడానికి, ముందుగా మీ పూర్తి పుట్టిన తేదీని DD- MM- YYYY ఫార్మాట్‌లో రాయండి.
పుట్టిన సంవత్సరంలోని చివరి అంకె, ‘పుట్టిన తేదీ చివరి అంకె’ను ఇస్తుంది. ఎలాగంటే.. ఉదాహరణకు, ఓ వ్యక్తి 14 సెప్టెంబర్ 1990 లో జన్మించినట్లయితే, అతని చివరి అంకె పుట్టిన తేదీ '0' (సున్నా)
‘0’ అంకె అంటే.. (1950, 60, 70, 80, 90, 00, 2010, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
జీరో న్యూమరాలజీ, ఐ చింగ్ న్యూమరాలజీ రెండింటి ప్రకారం, ఈ సంఖ్యలు మెటల్ మూలకంతో సంబంధం కలిగి ఉంటాయి.
మీ చివరి అంకె '0' అయితే, మీరు adaptive, తెలివైన వ్యక్తి. పెద్దగా కలగచేసుకోకుండానే ఎలా నిర్ణయాలు తీసుకోవాలో మీకు తెలుసు. వ్యక్తిగా ప్రతిదీ సాధిస్తారు. ఊసరవెల్లిలాగా మీ నిజమైన స్వభావాన్ని ముసుగు వేయగలుగుతారు. మీ నిజస్వరూపం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. మరోవైపు, మనోహరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు, అది ఆకర్షణీయంగా, రహస్యంగా కనిపిస్తుంది.
ఈ number వాళ్లు విజయవంతం కావడానికి తమ డ్రైవ్‌ను ఎన్నడూ వదులుకోరు. చేసే ప్రతీ పనిలో ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
స్వీయ-అభివృద్ధి సూచనలు
విజయం, అభివృద్ధికి సహనమే మీ ఆయుధం. అందుకే ఈ లక్షణాలు పెంపొందించుకోవడానికి ట్రై చేయాలి.
నంబర్ 1 (1951, 61, 71, 81, 91, 01, 2011, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '1' అయితే, మీరు చాలా competitive personగా కనిపిస్తారు. ఏదేమైనా విజయాన్ని చేజిక్కించుకుని ఆనందించే వ్యక్తి మీరు. చాలా మోటివేటెడ్, లక్ష్యం ఉన్న మనిషిమీరు. మీ కలల విషయానికి వస్తే మీరు ఒక యోధురాలు. అలాగే, మీరు సులభంగా వదులుకునే వ్యక్తి కాదు, చివరి శ్వాస వరకు పోరాడతారు.
మరోవైపు, సంపద, వస్తువుల కోసం మీ దాహం ఒక దుస్థితే అని చెప్పొచ్చు.
స్వీయ-అభివృద్ధి సూచనలు
ప్రతిదీ పరిపూర్ణంగా ఉండదని మీరు తెలుసుకోవాలి. కొన్ని విషయాలతో సర్దుబాటు చేసుకోవడం, సర్దుబాటును స్వీకరించడం నేర్చుకోవాలి.
నెంబర్ ‘2’ (1952లో జన్మించిన వ్యక్తులు, 62, 72, 82, 92, 02, 12, మొదలైనవి)
మీ చివరి అంకె '2' అయితే, మీరు రెండు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తిగా ఉంటారు. మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక విలక్షణమైన వ్యక్తిత్వం, మీరు అసహ్యించుకునే వారి కోసం మరొకరకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఒక వ్యక్తిగా, మీకు సన్నిహితంగా ఉండే, సన్నిహితంగా లేని వ్యక్తుల మధ్య మీరు స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతారు.
నీరు స్థిరంగా ఉండటం అసాధ్యం. అదేవిధంగా, ఈ వ్యక్తులు ఒక్కలాగే ఉండడం అసాధ్యం. నిరంతరం మారుతూ ఉంటారు. ఈ వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు.
స్వీయ-అభివృద్ధి సూచనలు
విషయాలను ignore చేయడం నేర్చుకోండి. జరుగుతున్న ప్రతిదాన్ని మనసు మీదికి తీసుకోకూడదనేది గుర్తు పెట్టుకోవాలి.
నెంబర్ ‘3’ (1953, 63, 73, 83, 93, 03, 13, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '3' అయితే, మీకు multi-dimensional వ్యక్తిత్వం ఉంటుంది. ఒక వ్యక్తిగా, మీరు జీవితం గురించి విభిన్న దృక్పథాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తారు. మీరు వివిధ దృక్కోణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీవి కావచ్చు లేదా మీ opponent's point of view కావచ్చు.
స్వీయ-అభివృద్ధి సూచనలు
ఇతరుల సలహాలను వినడం నేర్చుకోండి. సలహాను పరిశీలించకుండా దాన్ని తోసిపుచ్చడం మంచిది కాదు.
నెంబర్ ‘4’ (1954, 64, 74, 84, 94, 04, 14, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '4' అయితే, మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదాని గురించి మీకు తెలిసి ఉంటుంది. అన్ని ఎంపికలను వివరించే నాలుగు దిశల మాదిరిగానే ఇతరుల అవసరాలను అర్థం చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మీరు వర్ణించబడ్డారు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుందో లేదా నిరుత్సాహపరుస్తుందో మీకు తెలుసు. అంతే కాకుండా, మీ ఆలోచనలు మీ అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించబడతాయి.
స్వీయ-అభివృద్ధి సూచనలు
మీకు ప్రతిదానికీ సమాధానం కావాలనుకోకపోవడం మంచిది. ఇది మీపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఉంటుంది.
నెంబర్ ‘5’ (1955, 65, 75, 85, 95, 05, 15, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '5' అయితే, మీరు జీవితంలోని అన్ని కోణాల్లోనూ మానవత్వంతో వ్యవహరంచే వ్యక్తి. అగ్ని, నీరు, భూమి, హృదయం, గాలి ఐదు ప్రాథమిక భాగాలతో మీ వ్యక్తిత్వం రూపొందించబడి ఉంటుంది. ఇది ఉనికికి పునాది. వ్యక్తిగా మీరు విజయం సాధించగల, మీరు కోరుకున్న దేనినైనా , ఏదైనా మార్చే సామర్థ్యం ఉన్న పూర్తి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
స్వీయ-అభివృద్ధి సూచనలు
మీ వ్యక్తిగత, సామాజిక జీవితాలకు మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోండి. ఈ రెండింటిపై సమాన స్థాయిలో దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
నెంబర్ ‘6’ (1956, 66, 76, 86, 96, 06, 16, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '6' అయితే, మీరు జీవితంలోని చీకటి కోణాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడే వ్యక్తి. మీరు ఒక వ్యక్తిగా darkలో పరిణతి పొందుతున్నట్టుగా ఉంటారు. అయితే, ఇది అంత ప్రతికూల విషయం కాదు. ఏదేమైనా, ఒక వ్యక్తిగా, మిమ్మల్ని లేదా ప్రియమైన వారిని బెదిరించే లేదా ధైర్యం చేసే ఎవరినైనా ఎలిమినేట్ చేసే అధికారం మీకు ఉంది.
స్వీయ-అభివృద్ధి సూచనలు
సంబంధాలలో అతిగా possessive ఉండకపోవడం ముఖ్యం, కాబట్టి మీ సహచరుడికి కొంత స్పేస్ ఇవ్వడం నేర్చుకోండి.
నెంబర్ ‘7’ (1957, 67, 77, 87, 97, 07, 17, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె ఏడు అయితే, మీకు మర్మమైన వ్యక్తిత్వం ఉంటుంది. మీరు మనోహరమైన, ప్రకాశవంతమైన, చాలా పాలిష్ట్ వ్యక్తిగా కనిపిస్తారు. మరోవైపు, మీరు ఒక అమాయక చిరునవ్వు క్రింద రహస్యాలను దాచడంలో నేర్పరిగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రశంసించే మర్మమైన ఆత్మ మీరు అని గుర్తుంచుకోండి.
స్వీయ-అభివృద్ధి చిట్కాలు
మీపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు.
నెంబర్ ‘8’ (1958, 68, 78, 88, 98, 08, 18, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '8' అయితే, మీరు విశాలమైన, తీవ్రమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. క్రొత్త భావనలను,మీరు అన్నిటికన్నా అర్థవంతమైన చర్చకు విలువనిచ్చే వ్యక్తి, అన్నింటికన్నా మీ ప్రియమైనవారితో సన్నిహితంగా ఉండటాన్ని మీరు విలువైనదిగా భావిస్తారు.
స్వీయ-అభివృద్ధి సూచనలు
మిమ్మల్ని మీరు లెక్కలోకి తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం ప్రశంసనీయమే.. కానీ రోజూ ఆత్మత్యాగం చేయడం మంచిది కాదు.
నెంబర్ ‘9’ (1959, 69, 79, 89, 99, 09, 19, మొదలైన వాటిలో జన్మించిన వ్యక్తులు)
మీ చివరి అంకె '9' అయితే, మీరు చాలా సూక్ష్మంగా కనిపించే వ్యక్తి. మీకు సంబంధించని విషయాల విషయానికి వస్తే, మీరు మీ పద్ధతిలో జాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తారు. perfection కోసం ఎప్పుడూ వెతుకులాటలో కనిపించే perfectionist. మీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నించడం.. మీకు అనుకూలంగా ఉంటుంది.
స్వీయ-అభివృద్ధి సూచనలు
మొండిగా ఉండకండి. ఇతరులు చెప్పేదాని మీద కూడాశ్రద్ధ చూపండి.. వారికి అనుగుణంగా ఉండండి.