Alcohol: గోవా కాదు.. ఈ రాష్ట్రంలో తెలంగాణలో కంటే సగం ధరకే మందు, రీజన్ ఇదే

Published : May 09, 2026, 03:36 PM IST

 Alcohol: మన రాష్ట్రంలో కంటే.. గోవాలో తక్కువ ధరకే మద్యం లభిస్తుంది. కానీ.. గోవా కాకుండా మరో రాష్ట్రంలో కూడా ఇక్కడి కంటే సగం ధరకే మందు లభిస్తుందని మీకు తెలుసా? 

PREV
13
Alcohol

మీరు ఆల్కహాల్ కొనేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? మన తెలుగు రాష్ట్రాల్లో ఒక బాటిల్ పై మీరు చెల్లించే ధరలో సగానికి పైగా ప్రభుత్వానికే వెళ్తుందని మీకు తెలుసా? అదే హర్యానా లాంటి రాష్ట్రాల్లో మాత్రం రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మందు బాటిలో ఉన్న మందు ఒకటే అయినప్పుడు.. రేట్లు మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటాయి? అసలు ఆల్కహాల్ పై ట్యాక్స్ ఎలా విధిస్తారు? హర్యానాలో తక్కువకు దొరుకుతున్న మందు... మనకు మాత్రమే ఎందుకు కాస్ట్ లీ?

చాలా మంది మందు బాబులకు ఈ డౌట్ ఉంటుంది. గోవా, హర్యానా వెళ్లినప్పుడు అక్కడ మద్యం ధరలు చూసి షాక్ అవుతుంటారు. ఉదాహరణకు ఒక ప్రీమియం విస్కీ బాటిల్ హర్యానాలో రూ.1500 ఉంటే, అదే బాటిల్ మన దగ్గరకు వచ్చే సరికి రూ.3వేలు ఉంటుంది. ఈ తేడా వెనక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

23
1.ఎక్సైజ్ డ్యూటీ...

భారత రాజ్యాంగం ప్రకారం, మద్యం పై పన్నులు విధించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే.. బాటిల్ లోపల మందు ఒకటే అయినా రేట్లు మాత్రం భిన్నంగా ఉంటాయి.

హర్యానా ప్రభుత్వం మద్యంపై తక్కువ ఎక్సైజీ డ్యూటీని విధిస్తుంది. దీని వల్ల అక్కడ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అమ్మకాలు భారీగా జరుగుతాయి. రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుంది.

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మద్యంపై విధించే ఎక్సైజ్ డ్యూటీ, అదనపు పన్నులు చాలా ఎక్కువ. రాష్ట్ర బడ్జెట్ లో ఎక్కువ ఆదాయం మద్యం నుంచే వస్తుంది కాబట్టి.. ఇక్కడ ధరలు ఎక్కువగా ఉంటయి.

33
లైసెన్స్ ఫీజులు, పాలసీలు...

మద్యం దుకాణాలు వేలం పాటలు, లైసెన్స్ ఫీజులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. హర్యానాలో మద్యం సరఫరా గొలుసులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం, పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగా, ఏపీలో ప్రభుత్వం నియంత్రించే కార్పొరేషన్ల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. దీని వల్ల ధరలు ఎక్కువగా ఉంటాయి.

రవాణా, తయారీ ఖర్చులు....

నార్త్ లో మద్యం తయారీ యూనిట్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అక్కడ రవాణా ఖర్చులు తగ్గుతాయి. అదే సౌత్ రాష్ట్రాలకు రవాణా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే.. ధరల్లో తేడా ఉంటుంది.

ఆదాయ వనరుగా మద్యం

చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాలకు నిధుల కోసం మద్యం అమ్మకాలపైనే ఆధారపడతాయి. ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాల్లో మద్యం ధరలను పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ సామాజిక పథకాలకు మళ్లిస్తుంటారు. అందుకే ధరలు తగ్గించడం ప్రభుత్వాలకు సాధ్యం కాదు.

ఆ రాష్ట్రాల నుంచి మనం తెచ్చకోవచ్చా..?

ధర తక్కువగా ఉందని హర్యానా లేదా గోవా నుండి మద్యం బాటిళ్లు మన రాష్ట్రానికి తెచ్చుకోవడం చట్టరీత్యా నేరం. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు దగ్గర ఉంటే ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories