కత్తి కూడా వాడొచ్చు..
తాళింపు వంటి వాటి కోసం తక్కువ పరిమాణంలో వెల్లుల్లి తొక్క తీయాల్సి వచ్చినప్పుడు.. మీరు కత్తిని వాడొచ్చు.దీని కోసం... వెల్లుల్లి రెబ్బలను ఒక చాపింగ్ బోర్డుపై ఉంచండి. వెడల్పాటి కత్తి (లేదా రోలింగ్ పిన్) ఫ్లాట్ వైపును వెల్లుల్లిపై ఉంచండి. మీ అరచేతితో తేలికగా నొక్కండి. పగుళ్లు వచ్చే శబ్దం వస్తే, పైపొట్టు ఈజీగా తీయచ్చు..
జాడీలో ఊపే పద్ధతి:
ఈ పద్ధతి వేగంగా పనిచేస్తుంది, ప్రత్యేకించి మీరు ఒక వెల్లుల్లి గడ్డ మొత్తాన్ని ఒలవాలనుకుంటే. దీని కోసం, వెల్లుల్లిని తేలికగా నలిపి రెబ్బలను వేరు చేయండి. ఇప్పుడు వాటిని ఒక పెద్ద జాడీ లేదా టిఫిన్‌లో వేసి కొద్దిగా నూనె వేసి మూత పెట్టాలి. కాసేపు ఆ జాడీని ఊపితే.. తొక్క త్వరగా వచ్చేస్తుంది.
మైక్రోవేవ్ స్మార్ట్ ట్రిక్
మీకు మైక్రోవేవ్ ఉంటే, ఈ పద్ధతి త్వరగా పని చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మైక్రోవేవ్-సేఫ్ ప్లేట్ లేదా గిన్నెపై ఉంచండి. 15-20 సెకన్ల పాటు (లేదా పెద్ద రెబ్బలకు 30 సెకన్లు) ఎక్కువ వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా వెల్లుల్లి తొక్క వచ్చేస్తుంది.