Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్

Published : Oct 11, 2026, 12:48 PM IST

Nita Ambani: సంప్రదాయ చీరకట్టులో రాజసం ఉట్టిపడేలా కనిపించిన నీతా అంబానీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వదేశ్ బ్రాండ్ తొలి వార్షికోత్సవానికి వైన్ రెడ్ బనారసి చీరలో వచ్చారు. బంగారు నగలు, సంప్రదాయ అలంకరణతో చూపు తిప్పుకోనివ్వని లుక్ లో మెరిశారు.

PREV
16
నీతా అంబానీ గురించి..

నీతా ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకురాలు. రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్‌గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' లేదా స్వదేశీ బ్రాండ్లను ఆమె ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. తాజాగా తన లగ్జరీ బ్రాండ్ 'స్వదేశ్' మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ధరించిన చీర అందరి దృష్టినీ ఆకర్షించింది.

26
వైన్-రెడ్ బనారసి చీర

ఈ వేడుక కోసం నీతా అంబానీ అద్భుతమైన వైన్-రెడ్ బనారసి చీరను ఎంచుకున్నారు. భారతీయ సంప్రదాయ చేనేత కళ ఉట్టిపడేలా ఉన్న ఆమె చీర కట్టు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

36
బంగారు ఆభరణాల అలంకరణ

ఈ వైన్-రెడ్ చీరపై పురాతన బంగారు జరీ పనితనం ఆకట్టుకుంటోంది. దీనికి తగ్గట్టుగానే నీతా అంబానీ క్లాసిక్ ఆభరణాలను ధరించి రాయల్ లుక్ సొంతం చేసుకున్నారు. మెరూన్ లేదా వైన్-రెడ్ రంగుపై బంగారం, దంతపు రంగులో ఉన్న చిన్న చిన్న డిజైన్లు ఈ చీరకు మరింత అందాన్ని తెచ్చాయి. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడంతో చీర అందం రెట్టింపు అయింది.

46
ఆకట్టుకుంటున్న చెవి కమ్మలు

నీతా అంబానీ ఈ చీరను క్లాసిక్ స్టైల్‌లో కట్టుకున్నారు. పవిటను భుజం మీదుగా చేతిపైకి తీసుకున్నారు. ముందు భాగంలో ఉన్న వెడల్పాటి అంచు చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకు తగ్గట్టుగానే ఆమె సంప్రదాయ చెవి కమ్మలు, బ్లౌజ్ డిజైన్ చాలా యూనిక్ గా ఉన్నాయి.

56
హెయిర్ స్టైల్, మేకప్

నీతా అంబానీ తన జుట్టును వెనక్కి లాగి ముడి వేసుకుని నీట్ హెయిర్ స్టైల్‌ను ఎంచుకున్నారు. నుదుటిపై చిన్న సంప్రదాయ బొట్టు పెట్టుకున్నారు. సింపుల్ మేకప్‌తో మెరిసిపోయారు. చీర అంచు, ఆభరణాలు స్పష్టంగా కనిపించేలా ఆమె తన హెయిర్ స్టైల్‌ను సెట్ చేసుకున్నారు.

66
నీతా అంబానీ గురించి మరిన్ని విశేషాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీని ఆమె వివాహం చేసుకున్నారు. 2023లో ముంబైలో 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్'ను ఆమె ప్రారంభించారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అనేక ప్రదర్శనలు, విజువల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories