Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్

Published : Oct 05, 2026, 10:58 AM IST

Bommala Koluvu Decoration : ఈసారి బొమ్మల కొలువును రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? అయితే థీమ్ సెటప్ నుంచి విలేజ్ లుక్ వరకు మినిమల్ డెకరేషన్, పొటో కార్నర్ లాంటి అదిరిపోయే ఐడియాస్ మీ కోసం. ఓ లుక్కేయండి.

PREV
112
నవరాత్రి బొమ్మల కొలువు అలంకరణ

ఈసారి బొమ్మల కొలువును రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? బొమ్మల కొలువు అంటే అదో సందడి. ఆట పాటలు, పేరాంటాల పాటలతో…ఇంట్లోనే చిన్న పాటి జాతర వాతావరణంలా ఉంటుంది. అయితే ఈ నవరాత్రికి కాస్త వెరైటీగా ట్రై చేయండి. మీ ఇంటి కొలువును ఒక చిన్న గ్రామంగా, గుడి జాతరగా, లేదా పాతకాలం నాటి జీవనశైలి ఉట్టిపడేలా మార్చేయొచ్చు. అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే.

సోషల్ మీడియాలో ఇప్పుడు థీమ్ కొలువు, మినిమల్ కొలువు, నేచురల్ కొలువు, విలేజ్ కొలువు లాంటి ఐడియాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది ఇలాగే కొత్తగా అలంకరిస్తున్నారు. ఈ నవరాత్రికి మీ ఇంటి కొలువు కూడా విలేజ్ లుక్ తో అదిరిపోవాలంటే ఈ ఐడియాలను ఓసారి ట్రై చేసి చూడండి.

212
నవరాత్రి కొలువు ఎప్పుడు మొదలవుతుంది?

ఈ ఏడాది నవరాత్రి కొలువు అక్టోబర్ 11, ఆదివారం నాడు మొదలై, అక్టోబర్ 19, 2026 సోమవారం విజయదశమితో ముగుస్తుంది.

సాధారణంగా నవరాత్రులు మొదలయ్యే ముందు రోజే బొమ్మలను పేర్చి, మొదటి రోజు పూజతో కొలువును ప్రారంభిస్తారు. కాబట్టి, ఇంట్లో కొలువు పెట్టాలనుకునే వాళ్లు ముందుగానే మెట్లు, బొమ్మలు, అలంకరణ వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది.

312
చిన్న పల్లెటూరిని క్రియేట్ చేద్దామా

ఈ నవరాత్రికి మీ ఇంటి కొలువును చూడగానే అందరూ ఫిదా అయ్యేలా ఒక అందమైన చిన్న గ్రామంగా మార్చి చూడండి. రొటీన్‌గా బొమ్మలు పేర్చడానికి బదులు, పల్లెటూరి జీవితాన్ని కళ్లముందు ఉంచేలా ఈ థీమ్ సెట్ చేయొచ్చు.

ఒక చిన్న మట్టి ఇల్లు, పక్కనే పొలం, బావి, ఎద్దుల బండి, రైతులు, ఆవులు, మేకలు.. ఇలా చిన్న చిన్న బొమ్మలతో పల్లెటూరి అందాన్ని తీసుకురావచ్చు. చూసేవాళ్లు 'అరె.. ఒక చిన్న పల్లెటూరినే ఇక్కడ దించేశారు కదా' అని ఆశ్చర్యపోయేలా ఈ అలంకరణ ఉంటుంది.

పల్లెటూరి వాతావరణం కోసం ఆకుపచ్చని క్లాత్, ఆర్టిఫిషియల్ గడ్డి, చిన్న చెట్లు, మొక్కలు వాడొచ్చు. పొలాన్ని చూపించడానికి ఆకుపచ్చని వస్తువులు, మట్టి రోడ్డు కోసం చిన్న రాళ్లు లేదా ఇసుకను వాడితే సీన్ ఇంకా నాచురల్‌గా ఉంటుంది.

స్థలం తక్కువగా ఉన్నా పర్వాలేదు. కాస్త క్రియేటివిటీ, కొన్ని బుజ్జి బొమ్మలు, నాచురల్ లుక్ ఇచ్చే వస్తువులు ఉంటే చాలు. మీ ఇంట్లోనే ఒక అందమైన పల్లెటూరిని క్రియేట్ చేయొచ్చు.

412
గుడి వాతావరణం థీమ్

మీ బొమ్మల కొలువును కాస్త వెరైటీగా, సంప్రదాయం ఉట్టిపడేలా అలంకరించాలనుకుంటున్నారా? అయితే "టెంపుల్ ఫెస్టివల్" థీమ్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్.

కొలువు మధ్యలో ఒక అందమైన చిన్న గుడి గోపురాన్ని ఏర్పాటు చేయండి. దాని ముందు దేవుడి విగ్రహాలు, భక్తులు, గుడి వాకిలి పెట్టి ఒక చిన్న గుడి వాతావరణాన్ని సృష్టించండి. పక్కనే ఒక చిన్న రథాన్ని పెడితే అచ్చం గుడిలో జాతర జరుగుతున్నట్లే ఉంటుంది.

దీన్ని మరింత సహజంగా మార్చడానికి గుడి చుట్టూ పూల దుకాణాలు, గాజుల షాపులు, బొమ్మల కొట్లు, పండ్ల దుకాణాలు లాంటి చిన్న చిన్న బొమ్మలను పెట్టండి. భక్తుల రద్దీ, పిల్లలు జాతరను ఎంజాయ్ చేస్తున్నట్లుగా సెటప్ చేస్తే చూసేవాళ్ల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది.

రాత్రి పూట ఈ కొలువు అందాన్ని పెంచడానికి చిన్న ఎల్ఈడీ లైట్లను వాడండి. గుడి గోపురం చుట్టూ, రథం దగ్గర, దుకాణాల ముందు లైట్లు పెడితే సాయంత్రం వేళ మీ కొలువు ఒక చిన్న జాతరలా మెరిసిపోతుంది.

దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంట్లో ఉన్న పాత బొమ్మలు, చిన్న లైట్లు, కొన్ని క్రాఫ్ట్ వస్తువులతోనే ఈ థీమ్‌ను రెడీ చేయొచ్చు. సంప్రదాయం, భక్తి, పండుగ ఉత్సాహం.. ఈ మూడూ ఒకేచోట కనిపించాలంటే ఈ టెంపుల్ ఫెస్టివల్ థీమ్ సూపర్ ఛాయిస్.

512
సంప్రదాయ బొమ్మల కొలువు

ఈ నవరాత్రికి మీ కొలువులో కేవలం బొమ్మలు మాత్రమే కాకుండా, మన పూర్వీకుల జీవనశైలి ఎలా ఉండేదో ఇప్పటి తరానికి పరిచయం చేసేలా ఒక అందమైన సంప్రదాయ థీమ్‌ను ప్లాన్ చేయండి.

కొలువులో ఒకవైపు పాతకాలం నాటి పెంకుటిల్లు లేదా సంప్రదాయ ఇల్లు, అరుగు, వాకిలి, ముంగిలి లాంటివి సెట్ చేయండి. ఇంటి ముందు చిన్న రోలు, రోకలి, తిరగలి, మట్టి కుండ, రాగి పాత్రలు లాంటివి పెడితే.. ఏళ్ల కిందటి మన ఇళ్ల వాతావరణం కళ్లముందు కదలాడుతుంది.

నీళ్లు మోస్తున్న మహిళలు, చేటలో ధాన్యం చెరుగుతున్న దృశ్యం, రోట్లో పచ్చడి నూరుతున్నట్లుగా చిన్న బొమ్మలను పెట్టి.. అమ్మమ్మల కాలం నాటి రోజువారీ జీవితాన్ని ఒక చిన్న కథలా కొలువులో చెప్పొచ్చు.

వాకిట్లో చిన్న ముగ్గు, అరుగు మీద కూర్చున్న తాతయ్య-నానమ్మ బొమ్మలు, పక్కనే ఆడుకుంటున్న పిల్లలు.. ఇలా ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా సెట్ చేస్తే, కొలువు చూసే పెద్దవాళ్లకు వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలు కచ్చితంగా గుర్తొస్తాయి.

కేవలం బొమ్మలకే పరిమితం కాకుండా, మన మట్టి వాసనను, సంస్కృతిని చాటిచెప్పే కొలువుగా మార్చాలంటే ఈ సంప్రదాయ థీమ్ కచ్చితంగా మనసు దోచుకుంటుంది.

612
నేచురల్ కొలువు

కొలువు మెట్ల అలంకరణలో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడటానికి బదులు.. వెదురు బుట్టలు, జనపనార తాడు, చెక్క వస్తువులు, ఎండిన పూలు, ఆకులు, చిన్న కొమ్మలు లాంటి సహజమైన వస్తువులను వాడొచ్చు. ఇవి కొలువుకు చాలా నాచురల్ లుక్‌ను ఇస్తాయి.

కొలువు మెట్ల చివరల్లో చిన్న వెదురు బుట్టలు పెట్టి, అందులో ఎండిన పూలు లేదా ఆకులతో డెకరేట్ చేయొచ్చు. జనపనార తాడు చుట్టి, చిన్న చెక్క ముక్కలు వాడి బొమ్మలకు స్టాండ్స్ లాగా సెట్ చేయొచ్చు. దీనివల్ల ప్రతి స్టెప్ చాలా వెరైటీగా కనిపిస్తుంది.

పచ్చని ఆకులు, చిన్న మొక్కలు, కొబ్బరి ఆకులతో చేసిన వస్తువులు కూడా వాడితే కొలువుకు ఇంకా మంచి నాచురల్ లుక్ వస్తుంది. ముఖ్యంగా మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలకు ఈ అలంకరణ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

ఈ థీమ్ స్పెషాలిటీ ఏంటంటే.. పెద్దగా ఖర్చు లేకుండానే అందమైన కొలువును రెడీ చేయొచ్చు. సింపుల్‌గా ఉండాలనుకునే వాళ్లకు, సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకునే వాళ్లకు ఈ నేచురల్ కొలువు బాగా నచ్చుతుంది.

712
పిల్లల కోసం స్పెషల్ థీమ్

ఈ నవరాత్రికి పిల్లలను కూడా కొలువు అలంకరణలో ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలా? అయితే, కొలువులో వాళ్ల కోసమే ఒక ప్రత్యేకమైన ప్లేస్ కేటాయించి, వాళ్లకు నచ్చిన ప్రపంచాన్ని క్రియేట్ చేసి చూడండి.

పిల్లల ఊహలకు తగ్గట్టుగా స్పేస్ (అంతరిక్షం), సముద్ర ప్రపంచం, జంతువులు, స్కూల్, రైల్వే స్టేషన్ లాంటి థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

స్పేస్ థీమ్ అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాకెట్, వ్యోమగాములు లాంటివి సెట్ చేయొచ్చు. సముద్ర ప్రపంచం కోసం చేపలు, తిమింగలం, ఆక్టోపస్, పడవ లాంటి బొమ్మలు వాడొచ్చు. స్కూల్ థీమ్‌లో టీచర్, స్టూడెంట్స్, క్లాస్‌రూమ్, బ్లాక్‌బోర్డ్ లాంటివి చిన్న బొమ్మలతో రెడీ చేయొచ్చు.

ఇందులో స్పెషల్ ఏంటంటే.. థీమ్ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర్నుంచి బొమ్మలు పేర్చడం, చిన్న చిన్న డెకరేషన్స్ చేయడం వరకు పిల్లలనే ఇన్వాల్వ్ చేయొచ్చు. దీనివల్ల కొలువు వాళ్లకు ఒక ఆటలాగా, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి సమయంగా మారుతుంది.

812
మినిమల్ కొలువు

ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నా కొలువు పెట్టుకోవచ్చు. పెద్ద సంఖ్యలో బొమ్మలు పేర్చాల్సిన పనేమీ లేదు. 3 లేదా 5 మెట్లతో చిన్న కొలువు ఏర్పాటు చేసి, ముఖ్యమైన బొమ్మలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వొచ్చు.

ప్రతి బొమ్మకు మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి పేర్చితే చాలా నీట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుపు, క్రీమ్ లేదా లైట్ కలర్ క్లాత్ వాడి, చిన్న పూల అలంకరణలు యాడ్ చేయొచ్చు. సాయంత్రం వేళ ఎల్ఈడీ లైట్స్ వేస్తే కొలువు అందం మరింత పెరుగుతుంది. తక్కువ స్థలం, తక్కువ అలంకరణ.. కానీ చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది.

912
పూలతో అలంకరణ

ఈ నవరాత్రికి ఎక్కువ డెకరేషన్ ఐటమ్స్ లేకుండానే కొలువును అందంగా మార్చాలా? అయితే, సహజమైన పూలతో కొలువు మెట్లను అలంకరించి చూడండి.

కొలువు మెట్ల చివరల్లో మల్లె, బంతి, గులాబీ, చామంతి లాంటి పూలను చిన్న దండలుగా కట్టి వేలాడదీయొచ్చు. మెట్ల ముందు లేదా కొన్ని ముఖ్యమైన చోట్ల మాత్రమే పూలు పెట్టి డెకరేట్ చేస్తే, కొలువు చాలా నీట్‌గా కనిపిస్తుంది.

బొమ్మలకు అడ్డం పడకుండా కొన్ని చోట్ల మాత్రమే పూల అలంకరణ చేయడం మంచిది. దీనివల్ల పూల అందం కూడా సెపరేట్‌గా హైలైట్ అవుతుంది.

తెల్లటి మల్లెలతో పాటు పసుపు బంతి, ఎర్ర గులాబీ లాంటి వేర్వేరు రంగుల పూలను కలిపితే కొలువుకు మంచి కలర్‌ఫుల్ లుక్ వస్తుంది. చిన్న పూల బుట్టలు లేదా పూల తోరణాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.

1012
లైటింగ్ హైలైట్

పగటిపూట అందంగా కనిపించే కొలువు, సాయంత్రం లైట్లు వేయగానే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే ఈ నవరాత్రికి కొలువు అలంకరణలో లైటింగ్ మీద కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టండి. కొలువు మెట్ల వెనుక లేదా చివరల్లో చిన్న ఎల్ఈడీ లైట్లు సెట్ చేయొచ్చు.

ముఖ్యంగా బొమ్మలు ఉన్న చోట లైట్లను డైరెక్ట్‌గా ఎక్కువగా పెట్టకుండా, సాఫ్ట్‌గా వెలుతురు పడేలా సెట్ చేయాలి. దీనివల్ల మెయిన్ బొమ్మలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.

చిన్న లైట్లను పూల అలంకరణ, సంప్రదాయ బొమ్మలు లేదా కొలువు బ్యాక్‌గ్రౌండ్‌తో కలిపి సెట్ చేస్తే మంచి లుక్ వస్తుంది. సాయంత్రం వేళ గదిలోని మెయిన్ లైట్ కాస్త తగ్గించి, కొలువు లైట్లను మాత్రమే ఆన్ చేస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.

1112
ఒక ఫోటో కార్నర్ పెట్టండి

కొలువు పక్కనే ఒక అందమైన ఫోటో కార్నర్ సెట్ చేసి చూడండి. కొలువును చూడటంతో పాటు, ఇంటికి వచ్చే గెస్ట్‌లు ఫోటోలు దిగడానికి ఇది ఒక మంచి స్పాట్‌లా మారుతుంది.

కొలువు దగ్గర ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసి, దాని చుట్టూ మల్లె, బంతి, గులాబీ లాంటి పూలు, అందమైన తోరణాలు, చిన్న ఎల్ఈడీ లైట్లతో డెకరేట్ చేయొచ్చు.

బ్యాక్‌గ్రౌండ్‌లో "నవరాత్రి శుభాకాంక్షలు", "కొలువు 2026" లాంటి చిన్న అక్షరాల డెకరేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ట్రెడిషనల్ లుక్ కావాలంటే అరిటాకు, మామిడి ఆకుల తోరణం, పూల దండలు లాంటివి కూడా వాడొచ్చు.

ఇంటికి వచ్చే మహిళలు సంప్రదాయ చీరకట్టులో ఫోటోలు దిగొచ్చు. పిల్లలు వాళ్లకు నచ్చిన బొమ్మలతో నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోలు దిగడానికి ఈ ఫోటో కార్నర్ ఒక బెస్ట్ ప్లేస్ అవుతుంది.

కొలువును చూసి ఆనందించడమే కాకుండా, ఆ నవరాత్రి క్షణాలను అందమైన ఫోటోలుగా కూడా దాచుకోవచ్చు.

1212
మీకు నచ్చిన థీమ్ ఎంచుకోండి

ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొలువు అందంగా ఉండటం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పనేమీ లేదు. ఇంట్లో అప్పటికే ఉన్న బొమ్మలు, బట్టలు, పూలు, చెక్క వస్తువులు, చిన్న లైట్లు లాంటివి వాడి కాస్త క్రియేటివ్‌గా ఆలోచిస్తే చాలు.. అందమైన కొలువును రెడీ చేయొచ్చు.

ఈ నవరాత్రికి రొటీన్ కొలువుకు చిన్న బ్రేక్ ఇచ్చి, మీకు నచ్చిన ఒక థీమ్‌ను సెలెక్ట్ చేసుకుని డెకరేట్ చేసి చూడండి. ఈసారి మీ ఇంటి కొలువు కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories