కడుపులో ఎక్కువ మొత్తంలో గ్యాస్, యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది. దీంతో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీంతో చాలా మంది చాతిలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. సాధారణంగా సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువ మసాలాలు, కారం తినడం వంటివి అసిడిటీ కారణమవుతాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం, గబాగబా ఆహారాన్ని తీసుకోవడం కూడా అసిడిటీకి దారి తీస్తుంది.
ఇక మానసిక ఒత్తిడి కూడా అసిడిటీకి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. దీంతో అసిడిటీ సమస్య వస్తుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వారిలోనూ అసిడిటీ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది అసిడిటీ అనగానే రకరకాల మందులు ఉపయోగిస్తుంటారు. కానీ సహజ విధానాల్లో కూడా అసిడిటీకి చెక్ పెట్టొచ్చు. అలాంటి ఓ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..