Dark circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? ఇవిగో ఈ చిట్కాలు మీ కోసమే..!

First Published Jun 23, 2022, 4:57 PM IST

Under Eye Dark circles Cure: కళ్ల కింద నలుపు రంగు రావడానికి అనేక కారణాలున్నాయి. నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటివన్నీ కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కు కారణమవుతాయి. అలాగే కంప్యూటర్, టీవీ  స్క్రీన్ నుంచి వెలువడే నీలి కిరణాలకు అధికంగా గురికావడం, వయస్సులో శరీరంలో సంభవించే జన్యు మార్పుల వల్ల కూడా ఇవి వస్తుంటాయి. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు కంటి కింద నల్లటి వలయాల సమస్యతో బాధపడుతున్నారు. వివిధ కారణాల వల్ల కళ్ల కింద నలుపు రంగు వస్తుంది. నిద్రలేమి (Insomnia), పోషకాహార లోపం (Malnutrition), ఒత్తిడి (Stress)వంటి వివిధ కారణాల వల్ల  ఈ సమస్య వస్తుంది. 

వయస్సు పెరిగే కొద్దీ చర్మం కొల్లాజెన్ (Collagen), ఎలాస్టిన్ (Elastin)ను కోల్పోతుంది. దీనివల్ల కనురెప్పపై ఉండే చర్మం పొడిబారడంతో పాటుగా ముడతలు (Wrinkles)పడతాయి. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపేందుకు చర్మం తాజాగా ఉండేందుకు నీటిని తాగడం చాలా ముఖ్యం. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే కళ్ల కింద ఏర్పడ్డ బ్లాక్ సర్కిల్స్ పోవడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.  బ్లాక్ సర్కిల్స్ ను తొలగించడంలో ఈ క్రింది చిట్కాలు కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

దోసకాయ (Cucumber)

కీర దోసకాయలో అస్టిజెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. కీరదోసకాయను ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో కాసేపు ఉంచాలి. ఆ తర్వాత వాటిని మీ కళ్ళపై 10 నిమిషాలు ఉంచండి. కీరదోసకాయ రసాన్ని కళ్ల చుట్టూ మసాజ్ చేస్తే కూడా డార్క్ సర్కిల్స్ పోతాయి. 
 


ఆలుగడ్డ (Potato)

కళ్ల కింద నల్లటి వలయాలను వదిలించడంలో బంగాళాదుంపలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. బంగాళాదుంపల్లో ఆస్ట్రిజెంట్ లక్షణాలతో కూడిన ఎంజైమ్లు ఉంటాయి. ఇది కనురెప్పల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళదుంపలను ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో కాసేపు నిల్వ చేయాలి. ఆ తర్వాత దీన్ని ప్రతిరోజూ 10 నిమిషాల పాటు కనురెప్పలపై అప్లై చేసి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
 

బ్లాక్ టీ (Black tea)

బాగా చల్లబడిన బ్లాక్ టీని కాటన్ లో ముంచి మీ కళ్ళపై ఉంచండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది నలుపు రంగును మార్చడానికి, కళ్ళను ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
 

టొమాటో జ్యూస్ (Tomato juice)

టొమాటో రసాన్ని కనురెప్పల పైన అప్లై చేసి కాసేపయ్యాక కడిగేసుకుంటే కనురెప్పల నలుపుదనం తొలగిపోతుంది. టమోటాలు లైకోపీన్ యొక్క మంచి మూలం. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
 

Rose water

కాటన్ క్లాత్ లేదా కాటన్ ని చక్కటి మందంలో కట్ చేయండి. దీనిని రోజ్ వాటర్ లో ముంచి బ్లాక్ సర్కిల్స్ ఎంతవరకు ఉన్నాయో.. అంతవరకు అప్లై చేయండి. తరచుగా ఇలా చేయడం వల్ల కళ్ల కింద ఉండే మచ్చలు తొలగిపోవడమే కాకుండా మంచి రిఫ్రెష్ మెంట్ ను కూడా పొందుతారు.

click me!