Heart Patient: హార్ట్ పేషెంట్స్ వీటిని అస్సలు తినకూడదు..

First Published Jun 23, 2022, 4:27 PM IST

Heart Patient: ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి  హార్ట్ పేషెంట్స్ రోగులు ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Heart Patient Avoid These Foods: మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం.  గుండె పనిచేస్తున్నంత సేపు మాత్రమే.. మనం ఆరోగ్యంగా ఉండగలం. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన నిమిషమే.. మన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుంది. అంతటి ముఖ్యమైన గుండెను కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొందరు తెలిసి మరీ నిర్లక్యం చేస్తుంటే.. కొందరు తెలియక.. పొరపాటుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి మీరు ఏది తిన్నా అది మీ శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అందులో గుండె సంబంధిత రోగుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఆహారం ఒకటి.  గుండె రోగులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే.. గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఇంతకు హార్ట్ పేషెంట్లు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం హానికరం 

ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి దారుణంగా పెరుగుతుంది. శరీరంలో సోడియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు (High blood pressure)వస్తుంది. దీనితో పాటుగా మీ హృదయ స్పందన రేటు (Heart rate)కూడా పెరుగుతుంది. అందుకే హార్ట్ పేషెంట్లు ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ప్యాకేజ్ చేయబడ్డ ఫుడ్స్ ఐటమ్స్ ను అసలే తినకూడదు. 


ప్రాసెస్ చేసిన ఆహారాలు

పాస్తా (Pasta), వైట్ రైస్ (White rice) మొదలైన వాటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవన్నీ గుండె రోగికి అస్సలు మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు పెరగడమే కాకుండా..  మధుమేహం (Diabetes), కొలెస్ట్రాల్ (Cholesterol) వంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుకునే ప్రమాదముంది. 
 

షుగర్ పదార్థాలు

గుండె రోగులు చక్కెర పదార్థాలను వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం (Blood sugar level)పెరుగుతుంది. దీనితో మీ గుండె సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలను దూరం చేసుకున్నవారవుతారు. 

స్మోకింగ్

పొగతాగే అలవాటు ఉంటే.. వారే స్వయంగా తమ గుండెను నాశనం చేసుకుంటున్నవారు అవుతారు. పొగ మనిషిని చంపేస్తుంది. ఈ అలవాటు కనుక మీకు ఉంటే.. వెంటనే ఆ అలవాటు మార్చుకోవాలి. ప్రపంచంలో గుండెపోటుతో మరణించేవారిలో..మూడింట ఒక వంతు.. ఈ స్మోకింగే కారణమౌతోందట. కాబట్టి.. ఈ అలవాటు మార్చుకుంటే.. గుండె పదిలంగా మార్చుకోవచ్చు.

ప్రజలలో గుండెపోటుకు కారణమయ్యే ప్రధాన కారకాల్లో ఆల్కహాల్ ఒకటి. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని ప్రేరేపిస్తుంది, ఇది కొవ్వు అనారోగ్య రూపం, ఇది అధిక నష్టం కలిగిస్తుంది. దీని వల్ల . బరువు పెరగడానికి కారణమౌతుంది. కాబట్టి.. దీనిని మానేయాలి. పూర్తిగా మానేయలేకపోతే.. మితంగా తీసుకోవాలి. మితంగా పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం . మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దాని పర్యవసానాలను తగ్గించడానికి వ్యాయామం చేయడం చాలా అవసరం.

click me!