అసలు నిద్రకు, బరువుకు సంబంధమేంటి..? నిద్రపోకపోతే బరువెందుకు తగ్గరు..?

First Published Jun 23, 2022, 3:52 PM IST

బరువును తగ్గించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. కంటి నిండా నిద్రుంటేనే మీరు సులువుగా అధిక బరువు నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు నిద్రకు బరువుకు సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బరువు తగ్గాలని గంటలకు గంటలు వ్యాయామాలు చేస్తూ.. జిమ్ సెంటర్లలో చెమటలు చిందిస్తూ ఉంటారు. అలాగే డైటింగ్, యోగా .. ఇలా ఎన్నో చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు.  దీనికి మీ జీవనశైలి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. 

బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండే అనేక ముఖ్యమైన అంశాలను చాలా మంది విస్మరిస్తుంటారు. వాటిలో ఒకటి నిద్ర. మీకు తగినంత ,మంచి నిద్ర లేకపోతే.. మీరు బరువు తగ్గడం కష్టతరం అవుతుంది. బరువు తగ్గడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి, నిద్రకు మధ్యనున్న సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 

బరువు తగ్గడానికి నిద్ర చాలా అవసరం - ఆరోగ్యవంతమైన వ్యక్తికి కనీసం 7 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర మెదడుకు పోషణను అందిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఆరోగ్యకరమైన ఆహారం.. వ్యాయామంతో పాటుగా మంచిగా నిద్రపోవాలి. కొవ్వును కరిగించాలనుకుంటే ఖచ్చితంగా 8 గంటలు నిద్ర అవసరం. 
 

మీకు తగినంత నిద్ర లేకపోతే.. బరువు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే.. నిద్రలేమి సమస్య అస్సలు ఉండకూడదు. 

తక్కువ నిద్ర మీ శరీరం యొక్క అదనపు కార్టిసాల్, ఒత్తిడి,  హార్మోన్ల అసమతుల్యత, ఆకలిని పెంచుతాయి. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది.  నిద్రలేమి కారణంగా శరీరంలో కార్బోహైడ్రేట్ల జీవక్రియ తగ్గుతుంది. ఈ కారణంగా మీరు ఊబకాయం బారిన పడొచ్చు. 

తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలు పెరగడానికి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

sleep

రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో లెప్టిన్ స్థాయి (Leptin level) తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల అవసరం పెరుగుతుంది. అలాగే బరువు కూడా పెరుగుతారు. నిద్రలేమి కారణంగా శరీరంలో హార్మోన్ల స్థాయి అధ్వాన్నంగా మారుతుంది. ఇది బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది.

మంచి నిద్ర కోసం చిట్కాలు - గాఢంగా నిద్ర పోవాలంటే.. దాని కోసం మీ నిద్ర సమయాన్ని సెట్ చేయండి. నిద్రపోయే ముందు మీ సెల్ ఫోన్ ను యూజ్ చేయకండి.  నిద్రపోయే ముందు పుస్తకాన్ని చదవండి. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.

click me!