AC Alternatives: వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఏసీలు, కూలర్లపై ఆధారపడి డబ్బులు వృథా చేయడం కంటే, ఇల్లు కట్టుకునేటప్పుడే ఈ చిన్న మార్పులు చేసుకుంటే డబ్బు ఆదా చేయొచ్చు. వేడి ఎంత పెరిగినా కూడా ఇల్లు చల్లగా ఉంటుంది. అదెలాగో తెలుసా?
వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఏసీలు, కూలర్లపై ఆధారపడి డబ్బులు వృథా చేయడం కంటే, ఇల్లు కట్టుకునేటప్పుడే ఈ చిన్న మార్పులు చేసుకుంటే డబ్బు ఆదా చేయొచ్చు. వేడి ఎంత పెరిగినా కూడా ఇల్లు చల్లగా ఉంటుంది.
మండే ఎండల్లో ఇల్లు కూల్‍గా ఉంచడం చాలా కష్టం. ఇంట్లో ఏసీ, కూలర్ ఉన్నా, నేల నుంచి వచ్చే సెగ వల్ల ఇంట్లో ఉండలేక అల్లాడిపోతారు. అందుకే సరైన ఫ్లోరింగ్ ఎంచుకుంటే, ఇంట్లోని ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయొచ్చు. అందుకే చాలా మంది ఈ ఏసీలు కొనడం కంటే…బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయే ప్రత్యమ్నాయాలు చూస్తున్నారు.
25
కోటా స్టోన్‌లో అంత స్పెషాలిటీ ఏముంది?
కోటా స్టోన్ అనేది సహజమైన రాయి. ఈ రాయిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇంటిని చల్లగా ఉంచేలా చేస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రతను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. అందుకే పాతకాలం నుంచి ఇళ్లు, పెద్ద భవనాల్లో ఫ్లోరింగ్ కోసం దీనికి మంచి డిమాండ్ ఉంది. ఏసీ లేకపోయినా కూడా ఇంట్లోకి రాగానే ఒక మంచి కూలింగ్ వాతావరణం ఉండటం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది.
35
మార్బుల్ కన్నా చౌక
మామూలుగా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చాలా ఖరీదు. కానీ, కోటా స్టోన్ చాలా చవక. తక్కువ ధరలో మార్బుల్ లాంటి క్లాసీ, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా మీ ఇంటికి ప్రీమియం లుక్ ఇవ్వాలనుకుంటే, ఈ ఫ్లోరింగ్ బెస్ట్ ఛాయిస్. కోటా స్టోన్ చూడటానికి అందంగా ఉండటమే కాదు, చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. పగుళ్లు లేదా మరకలు పడే ప్రమాదం చాలా తక్కువ. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు.
ఇప్పుడు కోటా స్టోన్ పాలిష్డ్, మ్యాట్, యాంటీ-స్లిప్ వంటి రకరకాల ఫినిషింగ్‌లలో దొరుకుతోంది. పాలిష్డ్ ఫినిష్, మార్బుల్ లాంటి మెరిసే లుక్‌ను ఇస్తుంది. మ్యాట్ ఫినిష్ సింపుల్, డీసెంట్ లుక్‌ను అందిస్తుంది. ఇది మోడ్రన్, సంప్రదాయ ఇంటీరియర్ డిజైన్లకు సులభంగా సెట్ అవుతుంది. ఈ ఫ్లోరింగ్‌ను శుభ్రం చేయడం, మెయింటెయిన్ చేయడం చాలా సులభం. మామూలుగా తడిగుడ్డతో తుడిస్తే చాలు, చాలా ఏళ్లపాటు కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.
55
వేసవిలో కరెంటు బిల్లు ఆదా
కోటా స్టోన్ సహజమైన చల్లదనం వల్ల ఇంట్లోని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏసీ, కూలర్ వాడకం తగ్గుతుంది. ఇది మీ కరెంట్ బిల్లును కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. మీరు మీ ఇంటిని స్టైల్‌గా మార్చుకోవడంతో పాటు, చల్లగా ఉంచుకోవాలనుకుంటే, కోటా స్టోన్ ఫ్లోరింగ్ ఒక తెలివైన పెట్టుబడి. ఇది మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.