ఈ సూక్ష్మ పోషకాలను తీసుకుంటే ఆడవారి ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు..

First Published Sep 5, 2022, 3:10 PM IST

సూక్ష్మపోషకాలు ఆడవారి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి వారి జీవితంలోని వివిధ దశల్లో ఎంతో ఉపయోగపడతాయి. వయసు వారిగా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడవారు.. ఇప్పుడు లోకాన్ని ఏలే స్థాయికి చేరుకున్నారు. మగవారితో సమానంగా ఉన్నత స్థాయిలో ఉండటమే కాదు.. వారికి కంటే గొప్ప గొప్ప పొజీషన్ లో కొనసాగుతున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ప్రస్తుతం చాలా మంది ఆడవారు ఒక వయసుకు చేరుకునే సరికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిజానికి ఆడవారికి మగవారికంటే భిన్నమైన పోషకాలు అవసరం అవుతాయి. ఆడవారు ఎలాంటి ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం పదండి..  
 

కౌమారదశలో, రుతువిరతి సంభవించినప్పుడు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే రుతుస్రావం సక్రమంగా అయ్యేందుకు  ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సేంద్రీయ మాంసం,  తృణధాన్యాలు, విత్తనాలు, సీఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఇనుము పుష్కలంగా ఉండే ఆహారాలు బాగా శోషించుకోవాలంటే వీటిని నిమ్మకాయ, జామ, నారింజ, ఉసిరి వంటి విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలతో  తినాలి. 
 

ఇనుము శోషణకు ఆటంకం కలగకుండా ఉండాలంటే.. వీటిని టీ లేదా కాఫీతో తినకూడదు. మీ భోజనానికి టీ లేదా కాఫీ తాగడానికి 20 లేదా 30 నిమిషాల గ్యాప్ ఉండాలి. పండ్లు, కూరగాయల ద్వారా మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. 
 

ఆడవారి ఆరోగ్యానికి సూక్ష్మపోషకాల అవసరం చాలా ఉంది. ఇవి వారి జీవితంలోని ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.  విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 
 

విటమిన్ బి కాంప్లెక్స్ మహిళలను ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకాల నిధి. ఇవి శక్తి స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే గోర్లు, జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ విటమిన్లు గర్భధారణ సమయంలో, ఆ తర్వాత ఎంతో అవసరపడుతాయి. ఇవి వారిని అన్ని రకాలుగా హెల్తీగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన గర్భధారణను నిర్వహించడం, వికారాన్ని తగ్గించడం,  ప్రీ-ఎక్లంప్సియాను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 
 

మహిళలకు అవసరమైన మరొక ముఖ్యమైన పోషకం కాల్షియం. రుతువిరతి తరువాత హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. దీనివల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారడంతో పాటుగా బోలు ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది. అందుకే యుక్త వయసులో ఉన్నప్పటి నుంచే పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వీటితో పాటుగా ముదురు ఆకుపచ్చ కూరగాయలను కూడా మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోండి. వీటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

fiber

పిసిఒఎస్ లేదా పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ కూడా మహిళల్లో సర్వ సాధారణ సమస్యగా మారుతోంది. ఇది పేలవమైన జీవక్రియకు దారితీస్తుంది. దీనిని అదుపులో ఉంచాలంటే ఎక్కువ మొత్తంలో ప్రోటీన్,  ఫైబర్ ను తీసుకోవాలి. అలాగే తక్కువగా ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్స్ ను తీసుకోవాలి. వీలైతే వీటిని మొత్తానికే తినడం మానేయడం బెటర్. వీటితో పాటుగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా శరీరక వ్యాయామం కూడా చేయాలి.

పిసిఒఎస్ ను అదుపులో ఉంచుకోకుంటే.. హైపర్ టెన్షన్, మధుమేహం, డిస్ లిపిడేమియా మొదలైన ఇతర జీవక్రియ వ్యాధులకు దారితీస్తుంది. అల్లం, వెల్లుల్లి వంటి  అడాప్టోజెన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గి మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. 

నిద్ర కూడా మహిళల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఆడవారి ఆరోగ్యంగా నిద్ర ఒక ముఖ్యమైన  భాగం. ఎందుకంటే ఇది వారి హార్మోన్ల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మహిళలకు కంటినిండా నిద్ర చాలా అవసరం. 

click me!