ఈ పూలతో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా..?

Published : Sep 05, 2022, 02:10 PM IST

పూలను పూజకు, అలంకరణకు  లేదా వేడుకలకు ఉపయోగిస్తారన్న సంగతి అందరికీ తెలుసు.. కానీ వీటితో ఎన్నో రకాల రోగాలకు కూడా చెక్  పెట్టొచ్చన్న సంగతి మీకు తెలుసా..   

PREV
16
ఈ పూలతో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా..?

పూలు ఆరాధకు లేదా అలంకరణకు లేదా వివిధ వేడుకలకు ఉపయోగిస్తూ ఉంటారు. మీకు తెలుసా.. పూలనే కేవలం వీటికే కాదు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రకాల పూవుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో రకాల రోగాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇంతకీ  ఏయే పువ్వులు ఎలాంటి రోగాలను నయం చేస్తాయో తెలుసుకుందాం పదండి.. 

26

లావెండర్

లావెండర్ పువ్వులను నుంచి సువాసన ఎంతో బావుంటుంది. అందుకే దీన్నివివిధ రకాల బ్యూటీ ప్రొడక్స్ట్ లల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ పువ్వుల్లో కండరాల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ ను కూడా పోగొడుతాయి. ఈ పువ్వులు మన హెయిర్ కు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. 

36

మందార పువ్వులు

మందార పువ్వుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ పువ్వులను తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పువ్వు గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఈ పువ్వును ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాదు.. కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. 
 

46

బంతిపూలు

శీతాకాలంలో ఎక్కడ చూసినా బంతిపూలే కనిపిస్తాయి. ఈ పువ్వులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 

56

గులాబి

గులాబి పువ్వు అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. అందులోనూ దీన్ని ప్రేమకు ప్రతిరూపంగా చూస్తారు. ఈ పువ్వు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల విటమిన్లతో పాటుగా వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పువ్వు ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

66

Madagascar Periwinkle

Madagascar Periwinkle పువ్వు మధుమేహులకు దివ్య ఔషదంతో సమానం. ఎందుకంటే ఈ పువ్వుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలుంటాయి. కొన్ని పువ్వులను తీసుకుని కప్పు నీటిలో బాగా మరిగించి.. వడకట్టండి. ఈ  వాటర్ ను  ప్రతిరోజూ పరిగడుపున తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories