ఈ ఆహారాల్లో పోషకాలెక్కువ..! వీటితో ఎన్ని జబ్బులు తగ్గిపోతాయో తెలుసా..?

First Published Sep 4, 2022, 4:56 PM IST

ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే.. మన శరీరానికి పోషకాహారం చాలా అవసరం. మనం తినే ఆహార పదార్థాల ద్వారా ఎన్నో పోషకాలు అందుతాయి. పోషకాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడానికి ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ ను జరుపుకుంటారు. 

నేషనల్ న్యూట్రిషన్ వీక్ ను 1975 లో అమెరికన్ డైటెటిక్స్ అసోసియేషన్ ప్రారంభించింది. మన దేశంలో ఈ న్యూట్రిషన్ వీక్ ను 1975 లో మొట్టమొదటి సారి నిర్వహించారు. దీనిలో భాగంగా పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలేంటి.. అవి ఏయే రోగాలను నయం చేస్తాయో తెలుసుకుందాం పదండి. 

పెరుగు

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోబయోటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది. అంతేకాదు ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. ఇందుకోసం కాలాలతో సంబంధం లేకుండా కప్పు పెరుగును తినండి. 
 

వాల్ నట్స్ 

వీటిలో ఐరన్, ప్రోటీన్, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధిత రోగాలు కూడా తగ్గుతాయి. 
 

ఆకుకూరలు

మెంతికూర, బచ్చలికూర వంటి ఏ కూరగాయ అయినా సరే వాటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా ఆకుకూరల్లో మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 
 

వేరుశెనగ

వేరుశెనగను సూపర్ ఫుడ్ అంటారు. దీనిని తినడం వల్ల బాదం పప్పుల కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, పొటాషియం, ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 
 

కిడ్నీ బీన్స్

 కిడ్నీ బీన్స్ ను రాజ్మా అని కూడా అంటారు. దీనిలో ప్రోటీన్ తో పాటుగా మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల  మీ ఎముకలు, కీళ్లు బలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. 
 

చియా విత్తనాలు

చియా విత్తనాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి బరువును తగ్గించడంతో పాటుగా చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 

బ్రోకలీ

బ్రోకలీలో క్యాబేజీలో కంటే ఎక్కువ పోషకాలుంటాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైటో న్యూట్రియెంట్స్, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల నుంచి రక్షిస్తాయి.  ఇన్ఫ్లమేషన్ కు సంబంధించిన సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

బాదం

డ్రై ఫ్రూట్ లో బాదం ఒకటి. ఇవి టేస్టీగా ఉండటమే కాదు.. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, కాల్షియం, కాపర్,  మెగ్నీషియం, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పొటాషియం, సెలీనియం, విటమిన్ బి, థయామిన్, జింక్,  నియాసిన్, ఫోలిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. రోజూ 8 నుంచి 10 నానబెట్టిన బాదం పప్పులను తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!