స్కిప్పింగ్ తో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

First Published Sep 4, 2022, 3:00 PM IST

కొన్ని రకాల వ్యాయామాలు చేయాలంటే పక్కాగా జిమ్ కు వెళ్లాల్సిందే. కానీ స్కిప్పింగ్ ను ఎంచక్కా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంట్లో చేసే స్కిప్పింగ్ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గించేయగలదు.. 
 

వర్కవుట్స్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవే మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గించగలవు. ఒకవేళ మీరు వర్కవుట్స్ చేయలేదంటే సర్వరోగాలు మీకే చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు. తినడం, కూర్చొని పనిచేయడం వల్ల ఫాస్ట్ గా బరువు పెరగడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. అంతేకాదండోయ్ ఇంకా ఎన్నో రకాల రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఈ జబ్బులు మాకొద్దు బాబోయ్ అనుకుంటే మాత్రం రోజూ చిన్నవో పెద్దవో వ్యాయామాలు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు.

వ్యాయామం ఎన్నో విధాలుగా ఉంటుంది. అయితే వయసు, శారీరక పరిస్థితి, ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకొనే వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ముఖ్యంగా కఠినమైన వ్యాయామాలు చేసేముందు వైద్యుల సలహాలు తప్పక తీసుకోవాలి. 

అయితే కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది అవికూడా చేయరు. అయితే ఇలాంటి వారు ఎంచక్కా స్కిప్పింగ్ ను చేయొచ్చు. చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామం వల్ల మాకేంటి ప్రయోజనాలు అనేవారున్నారు. కానీ మీకు తెలుసా.. జిమ్ముల్లో చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. మీరు కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారు. స్కిప్పింగ్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం పదండి.. 

weight loss

బరువును తగ్గిస్తుంది

స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్  కూడా ఒక లాంటి వ్యాయామమే. స్కిప్పింగ్ వల్ల నిమిషాలను 15 నుంచి  20 కేలరీలను బర్న్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ ను చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. 

గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మెదడు పనితీరు మెరుగు

ఇది మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 

laziness

బద్దకం పోతుంది

స్పిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మీ బాడీ హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాదు.. మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అందుకు బద్దకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ ను రోజూ చేయండి.

ఆందోళన నుంచి ఉపశమనం

ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్ ముందుంటుంది. ఎందుకంటే ఇది ఎండార్ఫిన్ల హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 
 

click me!