Winter Vegetables: చలికాలంలో ఏ కూరగాయలు తినాలి, ఏవి తినకూడదు?

Published : Nov 27, 2026, 01:15 PM IST

Winter Vegetables: చలికాలంలో శరీరానికి తగిన పోషకాలు అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం కూడా అవసరం. ఈ సీజన్‌లో ఏ కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి? ఎవరు ఏ కూరగాయలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకుందాం.

PREV
17
చలికాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే!
చలికాలం వచ్చేసింది. ఈ వాతావరణంలో మన శరీరానికి తగిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కాలాన్ని బట్టి మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చలికాలంలో శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా కావాలి. కేవలం అన్నం, పప్పు తింటే సరిపోదు. మార్కెట్లో దొరికే కొన్ని కూరగాయలను తప్పనిసరిగా తినాలి. ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్, బీట్ రూట్, క్యాబేజీ లాంటివి మంచి పోషకాలను ఇస్తాయి. అసలు చలికాలంలో ఏమేం తినాలో, ఏవి తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
27
క్యారెట్
క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-ఎ గా మారుతుంది. కంటి చూపు మెరుగుపడటానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి విటమిన్-ఎ చాలా అవసరం. క్యారెట్‌లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్యారెట్‌ను పచ్చిగా లేదా సలాడ్‌లాగా, కూర వండుకుని తినవచ్చు.
37
పాలకూర
పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫైబర్ లాంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాలను పెంచడమే కాకుండా ఎముకలు బలంగా తయారవ్వడానికి తోడ్పడతాయి. చలికాలంలో పప్పులో వేసుకుని లేదా కూర, సూప్ లాగా పాలకూరను తీసుకోవచ్చు. కానీ కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మాత్రం పాలకూరను ఎక్కువగా తినకపోవడమే మంచిది.
47
బీట్‌రూట్
బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫోలేట్, పొటాషియం, ఫైబర్, న్యాచురల్ నైట్రేట్స్.. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి. బీట్‌రూట్‌ను కూరలా వండుకుని లేదా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు.
57
బ్రకోలీ
బ్రకోలీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు బలంగా మారడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. బ్రకోలీని కొద్దిగా ఉడికించి లేదా తక్కువ నూనెతో వేయించి తినడం మంచిది.
67
క్యాబేజీ
క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
77
ముల్లంగి
ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. జీర్ణక్రియకు కూడా మంచిది. ముల్లంగిని పచ్చిగా లేదా కూర వండుకుని తినవచ్చు. అయితే ముల్లంగి తింటే కొంతమందికి గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్య రావొచ్చు. అలాంటి వాళ్లు దీన్ని బాగా ఉడికించి తినాలి. మెంతికూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్త కణాల ఉత్పత్తికి, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Read more Photos on
click me!

Recommended Stories