Train Meals: రైళ్లలో ఇకపై ఫ్లైట్ భోజనం.. రైల్వే ప్రయాణికులకు ఇక పండగే

Published : Nov 27, 2026, 01:14 PM IST

Train Meals: భారతీయ రైల్వే తన లాంగ్ జర్నీ రైళ్లలో భోజనం నాణ్యతను పెంచేందుకు కొత్త కాంపాక్ట్ మెనూను తీసుకొస్తోంది. విమానాల్లో ఇచ్చే తరహాలో క్లౌడ్ కిచెన్ ద్వారా తయారు చేసిన ఈ ఆహారాన్ని ప్రయోగాత్మకంగా మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లలో అందిస్తున్నారు.

PREV
13
రైళ్లల్లో విమానం తరహా భోజనం

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి వార్త చెప్పింది. ఇకపై దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతను మెరుగుపరిచేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భోజనం మెనూలో ఎక్కువ ఆప్షన్లు ఇచ్చే బదులు, తక్కువ ఐటమ్స్ ఉండే కాంపాక్ట్ మెనూను పరిచయం చేసి మంచి ఫుడ్ అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

23
రైల్వే క్యాటరింగ్ విధానానికి గుడ్‌బై

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) విమానాల్లో అందించే భోజనం తరహాలోనే ఈ కొత్త మెనూను సిద్ధం చేసింది. ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, న్యూఢిల్లీ-వారణాసి మార్గాల్లో ఈ ప్రయోగం కొనసాగుతోంది.

గతంలో రైల్వే క్యాటరింగ్ వ్యవస్థ ద్వారా భోజనం తయారు చేసేవారు. ఇప్పుడు క్లౌడ్ కిచెన్లు, హోటల్ సంస్థల భాగస్వామ్యంతో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ముంబై-బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలులో బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ లేదా పోహా, ఉప్మా ఇస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి చపాతీ, అన్నం, పప్పు, కూరగాయలు లేదా చికెన్ ఐటమ్స్ ఉంటాయి.

33
సక్సెస్ అయితే విస్తరణ

పాత మెనూలో ఉన్న సూప్, ఆమ్లెట్, శాండ్‌విచ్, మజ్జిగ, చాక్లెట్, సలాడ్, పచ్చడి, స్వీట్స్ లాంటి చాలా ఆప్షన్లను తొలగించారు. భోజనం మొత్తం బరువును 700-750 గ్రాముల నుంచి 450-500 గ్రాములకు తగ్గించారు. అయితే ఫుడ్ క్వాంటిటీలో ఎలాంటి మార్పు చేయలేదని అధికారులు చెప్పారు. దీనివల్ల ఆహారం నాణ్యత పెరిగి, ఫిర్యాదుల సంఖ్య 10 శాతం వరకు తగ్గిందని సమాచారం. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే, లాంగ్ జర్నీ, ప్రీమియం రైళ్లకు కూడా ఈ మెనూను విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories