Spicy Chicken: హోటల్ స్టైల్లో స్పైసీ చికెన్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!

Published : Nov 27, 2026, 01:15 PM IST

Spicy Chicken: స్పైసీ చికెన్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఘాటైన మసాలాలు, కమ్మని వాసనతో హోటల్ స్టైల్లో చికెన్ తయారు చేస్తే ఆ రుచే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి ఇంట్లోనే నోరూరించే స్పైసీ చికెన్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

PREV
16
హోటల్ స్టైల్ స్పైసీ చికెన్ రెసిపీ

నాన్ వెజ్ లవర్స్ కి చికెన్‌తో ఏ వంటకం చేసినా పండగే. ముఖ్యంగా హోటల్ స్టైల్లో ఘాటైన మసాలాలతో తయారుచేసే స్పైసీ చికెన్ రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. మరి హోటల్ స్టైల్ స్పైసీ చికెన్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో, అందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

26
కావాల్సిన పదార్థాలు

వేయించి పొడి చేయడానికి:

ఎండుమిర్చి- 8–10

ధనియాలు- 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర- 1 టీస్పూన్

మిరియాలు- 1 టీస్పూన్

దాల్చిన చెక్క- 2 చిన్న ముక్కలు

లవంగాలు- 5

యాలకులు- 3

అనాసపువ్వు- 1

గసగసాలు- 1 టీస్పూన్

గ్రేవీ కోసం:

చికెన్- 500 గ్రాములు

ఉల్లిపాయలు- 2 (సన్నగా తరిగినవి)

టమాటాలు- 2

పచ్చిమిర్చి- 3

అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు

కారం- 2 టీస్పూన్లు

పసుపు- ¼ టీస్పూన్

కరివేపాకు- కొద్దిగా

కొత్తిమీర-కొద్దిగా

నూనె- 4 టేబుల్ స్పూన్లు

ఉప్పు- తగినంత

వాటర్- తగినంత

36
తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు వేసి నూనె లేకుండానే మీడియం మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.

46
మరో కడాయిలో..

ఇప్పుడు మరో వెడల్పాటి కడాయి తీసుకుని తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి తాలింపు వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు ఓపిగ్గా వేయించాలి.

56
బాగా ఫ్రై చేయడం..

ఉల్లిపాయలు బాగా వేగాక, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలపాలి. తర్వాత తరిగిన టమాటాలు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యేలా ఉడికించాలి. ఇందులో పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి, ఉల్లిపాయ టమాట మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలా బాగా ఫ్రై చేయాలి.

66
స్పైసీ చికెన్ రెడీ..

చికెన్ మసాలాతో బాగా కలిశాక రెండు కప్పుల నీళ్లు పోసి కడాయిపై మూతపెట్టాలి. మీడియం మంట మీద 15 నిమిషాల పాటు చికెన్ ఉడికించాలి. చికెన్ ముప్పావు వంతు ఉడికాక మూత తీసి, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని చల్లాలి. అలాగే కాస్త తాజా కరివేపాకు వేసి బాగా కలపాలి. మళ్లీ మూతపెట్టి చిన్న మంటపై మరో 10 నిమిషాలు ఉడికించి దించుకుంటే.. గుమగుమలాడే స్పైసీ చికెన్ రెడీ అయినట్లే.

Read more Photos on
click me!

Recommended Stories