మదర్స్ డే సందర్భంగా ఈ గిఫ్ట్ ఇస్తే అమ్మ ఎంత ఆనందపడుతుందో తెలుసా?

Published : May 04, 2025, 03:29 PM IST

Mothers Day: మదర్స్ డే ఈ ఏడాది మే 11న వచ్చింది. ఈ సందర్భంగా మీ అమ్మను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏదో ఒక గిఫ్ట్ కొనే బదులు ఇక్కడ చెప్పిన గిఫ్ట్స్ ట్రై చేయండి. వీటిని చూసి మీ మదర్ కచ్చితంగా సంతోషపడతారు. 

PREV
15
మదర్స్ డే సందర్భంగా ఈ గిఫ్ట్ ఇస్తే అమ్మ ఎంత ఆనందపడుతుందో తెలుసా?

త్యాగం అంటే అమ్మ, సహనం అంటే అమ్మ, తెలివికి అర్థం అమ్మ. బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తినట్టే. అంతటి నొప్పిని సైతం భరించి మనకు జన్మనిచ్చే అమ్మ కోసం ప్రత్యేకమైన రోజు ఏంటండి.. అమ్మకు ప్రతి రోజు గిఫ్ట్ ఇచ్చినా సరిపోదు. కాని మదర్స్ డే అంటూ ప్రత్యేకంగా నిర్వహించడానికి కారణం.. ఆమె గొప్పతనాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం కోసం. ఈ సందర్భంగా అమ్మకు ఇష్టమైన వస్తువులు గిఫ్ట్ గా ఇస్తే ఆమె ఆనంద పడుతుంది. 

 

25

ఫోటో ఫ్రేమ్ లేదా స్క్రాప్ బుక్ 

అమ్మ పాత ఫోటోలతో తయారు చేసిన ఫోటో ఫ్రేమ్ ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వండి. లేదా చేతితో తయారు చేసిన స్క్రాప్‌బుక్ మీ మదర్ తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఆమె చిన్ననాటి, మీ చిన్ననాటి చిత్రాలు కలిపి ఫ్రేమ్ చేసి ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపిన క్షణాల ఫోటోలను ఫ్రేమ్ లలో చేర్చి గిఫ్ట్ ఇవ్వండి. లేదా అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ అందమైన లేఖ లేదా నోట్ రాసి ఇవ్వండి. ఆమె భావోద్వేగంతో మిమ్మల్ని హత్తుకొని ప్రశంసిస్తారు. 

35

సొంతంగా లెటర్ రాసి ఇవ్వండి

మీ స్వహస్తాలతో మీ అమ్మ గొప్పతనాన్ని చక్కని లెటర్ రూపంలో రాసి అమెకు ఇవ్వండి. అది చదువుతూ ఆమె ఎంత ఆనంద పడతారో మీరే చూస్తారు. మీ కోసం అమ్మ ఏమి చేసిందో రాయండి. మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో భావోద్వేగంగా చెబుతూ లేఖ రాయండి. మీ సొంత చేతి రాతతో రాసిన లేఖ ఖరీదైన బహుమతి కంటే విలువైందని మీకు అర్థమవుతుంది. 

 

45

అమ్మకు ఇష్టమైన చీర కొనండి

అమ్మకు ఎల్లప్పుడూ ఇతరుల కోసం ఏదైనా కొనడంలో ఆనందం ఉంటుంది. కానీ తన కోసం ఆమె చాలా తక్కువగా కొనుక్కుంటుంది. ఈసారి ఆమెకు నచ్చిన చీర, సూట్ లేదా డ్రెస్ బహుమతిగా ఇవ్వండి. ఈ రోజు నువ్వు స్టైల్‌గా, అందగా కనిపించాల్సిన సమయం అని చెప్పండి. ఆమె చాలా ఆనంద పడుతుంది. 

55

అమ్మకు నచ్చిన ఫుడ్ ఐటమ్ తయారు చేయండి

ప్రతి రోజు అమ్మే మనకు వంట చేసి పెడుతుంది కదా.. మదర్స్ డే రోజు ఆమెకు రెస్ట్ ఇచ్చి మీరే స్వయంగా వంట చేసి ఆమెకు పెట్టండి. అది కూడా ఆమెకు నచ్చిన ఫుడ్ ఐటమ్ మీరే వండి సర్వ్ చేయండి. ఆమె ఆనందానికి అవధులు ఉండవంటే నమ్మండి. రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చే బహుమతుల కంటే సింపుల్ గా, మనస్ఫూర్తిగా ఇచ్చే ఇలాంటి గిఫ్ట్ లు అమ్మలకు బాగా నచ్చుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories