Snake Prevention: ఇలా చేస్తే వర్షాకాలంలోనూ పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు

Published : May 16, 2026, 04:02 PM IST

Snake Prevention: వర్షాకాలం వస్తే చాలు పాములు, పురుగులు ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. దీంతో ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు రోజూ భయపడుతూ ఉండాలి. పిల్లలను ఒక్కరినే ఇంట్లో ఉంచాలంటే కంగారు ఉంటుంది. అసలు పాములే దరిదాపుల్లో రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. 

PREV
15
రంధ్రాలు, బొరియలు మూసేయాలి

వర్షాకాలం వస్తే చాలు..పురుగులు, పాములు, తేళ్లు, జర్రిలు ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. దీంతో ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు కావొచ్చు ప్రతిరోజూ భయపడాల్సి ఉంటుంది. పిల్లలను ఒక్కరినే ఇంట్లో ఉంచాలంటే కంగారుగా ఉంటుంది అందుకే ముందుగా చేయాల్సింది…ఇంట్లో ఎక్కడైనా కన్నాలున్నాయో, లేదో చెక్ చేయాలి. తలుపులు, కిటికీల దగ్గర ఉండే సందులను, పగుళ్లను వెంటనే మూసివేయాలి. ఇలా చేయడం వల్ల బయటి నుంచి పాములు, ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు.

25
గార్డెన్‍ను శుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటి ఆవరణలో మొక్కలు, తోటలు ఉండటం ఎంత అందమో... వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం అంతే ప్రమాదం. గార్డెన్‌లోని మొక్కలు, పొదలు గుబురుగా పెరిగి అడవిలా మారకుండా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దట్టమైన పొదలు, రాలిన ఎండిపోయిన ఆకుల కుప్పలు పాములు హాయిగా దాక్కోవడానికి, చల్లదనం కోసం చేరడానికి ఎంతో అనువుగా ఉంటాయి.

అందుకే గార్డెన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, కింద పడిన ఎండిన కొమ్మలను తీసేయాలి. అలాగే మొక్కల మొదళ్ల వద్ద కాస్త ఖాళీ స్థలం ఉండేలా చూసుకుంటే, అక్కడ ఏదైనా ఉన్నా వెంటనే మన కంటికి కనిపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ చిన్న జాగ్రత్త ఎంతో అవసరం

35
ఇంటి పరిసరాలను క్లీన్‍గా ఉంచుకోవాలి

ఇంటి చుట్టూ పడేసిన ఆహార పదార్థాలు, చెత్తాచెదారం ఉంటే పాములు, పురుగులు చేరే ప్రమాదం ఉంది.  నిజానికి మనం పడేసే అన్నం, కూరగాయల వ్యర్థాల కోసం ఎలుకలు, కప్పలు, బల్లులు వస్తాయి. వీటిని వేటాడటం కోసమే పాములు మన ఇంటి పరిసరాల్లోకి, ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లోపలికి వస్తాయి.

ముఖ్యంగా వర్షాకాలంలో బయట పొలాలు, కన్నాలు నీటితో నిండిపోతే పొడి ప్రదేశాల కోసం పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఇల్లు, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, డస్ట్‌బిన్‌లకు మూతలు పెట్టి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే పాములు మన ఇంటి దరిచేరకుండా చూసుకోవచ్చు.

45
ఘాటు వాసన వచ్చే మొక్కలు ఉండకుండా చూసుకోవాలి

పాములను దూరం పెట్టడానికి కెమికల్స్ వాడే బదులు, సహజసిద్ధమైన పద్ధతులు పాటించాలి. మీ కాంపౌండ్ వాల్ దగ్గర సర్పగంధ, నిమ్మగడ్డి, వెల్లుల్లి మొక్కలు, బంతి పూల మొక్కలు ఉంటే ఆ వాసనకు పాములు చేరవు. 

55
చెత్తాచెదారం, వ్యర్థాలను నిల్వ ఉంచకూడదు

ఇంటి లోపల, బయట చెత్తను అస్సలు నిల్వ చేయోద్దు. ఇది పాములను ఆకర్షించేలా చేస్తుంది. ఇంటిని శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల పాములు ఏవీ కూడా ఇంట్లోకి రావు. మీరు, మీ ఫ్యామిలీ నిశ్చింతగా ఉండొచ్చు

Read more Photos on
click me!

Recommended Stories