Home Decor: ఇంట్లో పెయింటింగ్ పనులు పూర్తయ్యాక ఖాళీ పెయింట్ బకెట్లు, పెరుగు బకెట్లను చాలామంది బాత్‌రూమ్‌లలో ఉపయోగిస్తుంటారు. కొందరైతే పక్కన పడేస్తుంటారు. అయితే వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ ఇంటి లుక్కునే మార్చేయొచ్చు.
సాధారణంగా చాలా మంది ఇళ్లలో ఇలాంటి పాత బకెట్లను బాత్‌రూమ్‌లకు పరిమితం చేస్తారు. లేదంటే స్టోర్ రూమ్‌లో పక్కన పడేస్తుంటారు. అయితే పాత వస్తువులను పారేయకుండా మళ్లీ ఉపయోగించడం వల్ల డబ్బు ఆదా కావడంతో పాటు ఇంటికి ప్రత్యేకమైన అందం కూడా వస్తుంది. చిన్న, చిన్న మార్పులతోనే పనికిరానివిగా కనిపించే పెయింట్ బకెట్లు ఇంట్లో ఉపయోగకరమైన వస్తువులుగా మారిపోతాయి. ఈ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలు
27
స్టైలిష్ లాండ్రీ బాస్కెట్‌గా వినియోగం
పాత పెద్ద బకెట్లను లాండ్రీ బుట్టలుగా మార్చుకోవచ్చు. వాటిపై ఫ్యాబ్రిక్ కవర్ లేదా బాంబూ షీట్లు అమర్చితే ఖరీదైన లాండ్రీ బాస్కెట్‌లా కనిపిస్తుంది. బాత్రూమ్ లేదా బెడ్‌రూమ్ మూలలో ఉంచితే బట్టలు చక్కగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.
37
గార్డెన్‌కు కొత్త అందం ఇచ్చే ప్లాంటర్‌లు
పాత పెయింట్ బకెట్లను అందమైన మొక్కల కుండీలుగా మార్చుకోవచ్చు. వాటికి మీకు నచ్చిన రంగులు వేసి బాల్కనీ లేదా టెర్రస్‌లో అమర్చితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చిన్న పూల మొక్కల నుంచి మనీ ప్లాంట్‌ల వరకు వీటిలో సులభంగా పెంచవచ్చు. బకెట్ బయట భాగానికి తాడు లేదా జ్యూట్ క్లాత్ చుట్టితే మరింత నేచురల్ లుక్ వస్తుంది.
పిల్లల బొమ్మలు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కనిపించడం సాధారణమే. అలాంటి సమయంలో పెయింట్ బకెట్లను టాయ్ స్టోరేజ్‌గా వాడుకోవచ్చు. కార్టూన్ స్టిక్కర్లు, రంగురంగుల పెయింటింగ్‌తో బకెట్లను డిజైన్ చేస్తే పిల్లలకు కూడా ఆసక్తిగా ఉంటుంది. బొమ్మలు ఒకేచోట ఉండటంతో గది కూడా శుభ్రంగా కనిపిస్తుంది.
57
బాల్కనీకి అందమైన సైడ్ టేబుల్
ఒక పెద్ద పెయింట్ బకెట్‌ను తలకిందులుగా పెట్టి పైభాగంలో చెక్క పలక అమర్చితే చిన్న సైడ్ టేబుల్ సిద్ధమవుతుంది. టీ కప్పులు, పుస్తకాలు లేదా చిన్న అలంకరణ వస్తువులు పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బాల్కనీ, గార్డెన్ వంటి ప్రాంతాల్లో ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
67
తాడుతో డెకరేటివ్ బాస్కెట్
పెయింట్ బకెట్ చుట్టూ మందమైన జ్యూట్ తాడు చుట్టి అందమైన అలంకరణ బుట్టలా మార్చుకోవచ్చు. ఇందులో మ్యాగజైన్లు, ఛార్జర్లు, చిన్న దుప్పట్లు లేదా ఇతర వస్తువులు ఉంచుకోవచ్చు. బోహో స్టైల్ లేదా రస్టిక్ ఇంటీరియర్ డెకర్‌కు ఇవి అద్భుతంగా సరిపోతాయి.
77
ఇంటి బయట చెత్త బుట్టగా..
పాత బకెట్లను చిన్న డస్ట్‌బిన్‌లుగా కూడా మార్చుకోవచ్చు. పైభాగంలో మూత అమర్చితే మరింత శుభ్రంగా కనిపిస్తుంది. ఇంటి బయట లేదా గార్డెన్ ప్రాంతంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే పెంపుడు జంతువుల ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఈ బకెట్లు ఉపయోగపడతాయి. మూత బిగుతుగా ఉండేలా మార్చితే ఆహారం తాజాగా ఉంటుంది.