Published : May 30, 2026, 06:22 PM ISTUpdated : May 30, 2026, 06:52 PM IST
వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడుతుంది... ఎండల నుంచి ఉపశమనం దొరుకుతుంది. కానీ ఇదే సమయంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి. మరి ఈ వానాకాలంలో ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకూడదంటే ముందస్తుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
వానాకాలంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ స్విచ్‌లు, వైర్లలోకి తేమ చేరకుండా చూసుకోవాలి. తేలిన వైర్లు, పాడైపోయిన స్విచ్ లతో వర్షకాలం ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం మొదలవకముందే పాడైన స్విచ్‌లు, లూజ్‌గా ఉన్న వైర్లను వెంటనే మార్చేయాలి. వాటర్‌ప్రూఫ్ బాక్సులను ఉపయోగించి వాటిని సురక్షితంగా ఉంచడం మంచిది.
25
డ్రైనేజీ పైపులు క్లీన్ చేయండి
ఎండాకాలంలో ఇంటి పరిసరాల్లోని చెట్లు, పొదలు ఎండిపోతాయి... ఆకులు, కొమ్మలు నేలరాలుతాయి. వర్షాకాలం రాగానే ఈ చెత్తాచెదారం డ్రైనేజీలో పేరుకుపోయి వాననీరు వెళ్లకుండా పైపులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే డ్రైనేజీ శుభ్రం చేయాలి. అవసరమైతే ప్లంబర్ ను పిలిపించి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను చెక్ చేయించండి... ప్రాబ్లం ఉన్నచోట రిపేర్లు చేయించండి
35
తలుపులు, కిటికీలు పాడవకుండా చూడండి
వానాకాలంలో చెక్కతో చేసిన తలుపులు, కిటికీలు తేమను పీల్చుకుని ఉబ్బిపోతాయి. దీనివల్ల అవి సరిగ్గా మూసుకుపోవు… ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉంటే వీటిని మూయలేరు.. పెద్దవాళ్లకు కూడా కష్టమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వర్షంలో నానే అవకాశాలున్న కిటికీలు, తలుపులకు వార్నిష్ లేదా కొత్త ఫినిషింగ్ వేయించడం మంచిది.
వర్షాకాలంలో ఇంటి గోడలు, పైకప్పు (రూఫ్) నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా చూసుకోవాలి… ఇలా జరిగితే ఇళ్లు మొత్తం పాడైపోయే అవకాశాలుంటాయి. అందుకే వర్షాలు మొదలవకముందే లీకేజీలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ పెయింట్లు వాడటం, లీకేజీ ఉన్న చోట్ల సీల్ చేయడం వంటి పనులు పూర్తి చేయాలి.
55
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొండి
ఎండాకాలంలో క్లీన్ గా ఉండే ఇంటి పరిసరాలు వర్షకాలంలో పిచ్చి మొక్కలతో నిండిపోతాయి. దీంతో పాములు. తేళ్లు వంటి విషపూరిత జంతువులు వీటిలోకి చేరతాయి.. అక్కడినుండి ఇంట్లోకి వస్తుంటాయి. ఇది చాలా ప్రమాదకరం.. కాబట్టి వర్షాకాలంలో తరచూ ఇంటి పరిసరాలను క్లీన్ చేసుకుంటూ ఉండాలి.