Monsoon Health Tips: వర్షకాలంలో ఈ ఆహారాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..

Published : Jul 23, 2022, 12:00 PM IST

Monsoon Health Tips: వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. అందుకే అలాంటి వాటిని తినడం పూర్తిగా మానేయాలి.  

PREV
111
 Monsoon Health Tips: వర్షకాలంలో ఈ ఆహారాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..
monsoon diet

ముందే ఇది వర్షాకాలం. ఈ సీజన్ లో రోగ నిరోధక వ్యవస్థ ఏ మాత్రం బలహీనంగా ఉన్నా ఎన్నో అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్, జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది.అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తినాలి, ఏది తినకూడదు  వంటి విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా తినడం మానుకోవాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

211

స్పైసీ ఫుడ్ (Spicy food)

వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను తినకపోవడమే మంచిది. వేయించిన, ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. వీటిని తింటే కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 
 

311
soft drinks

శీతల పానీయాలు (Soft drinks)

ఈ సీజన్ లో శీతల పానీయాలను మొత్తానికే తాగకూడదు. ముందే ఈ సీజన్ లో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో శీతల పానీయాలను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. 
 

411

వర్షకాలంలో ఆకుపచ్చ కూరగాయలు, కాలీ ఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను తినడం మానుకోవాలి.  ఈ సీజన్ లో వీటిని తింటే కడుపులో ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే ఈ సీజన్ లో ఈ కూరగాయలను తినకండి.
 

511

ఆకుకూరలు (Greens)

వర్షాకాలంలో ఆకు కూరలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటి ద్వారా సంక్రమణ ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఆకులకు కీటకాలు ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో వీటిని నివారించండి. 
 

611

చేపలు, మాంసం

ఈ సీజన్ లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో మాంసాహారాలు చాలా త్వరగా చెడిపోతాయి. అందుకే ఈ సీజన్ లో మాంసం, చేపలను ఎక్కువగా తినకూడదు. అందులోనూ ఈ సీజన్ చేపల సంతానోత్పత్తి సమయం. ఇలాంటి  సమయంలో వీటిని తినకపోవడమే మంచిది.

711

వర్షకాలంలో పండ్లను ఎక్కువ మొత్తంలో తినడం మంచిది. అందులోనూ  ఈ సీజన్ లో బొప్పాయి, నేరేడు పండ్లు, మామిడి పండ్లు, యాపిల్ పండ్లు, జామ పండ్లు, పియర్ వంటి సీజన్ పండ్లను తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇవి జీర్ణవ్యవస్థను బలంగా కూడా చేస్తాయి. 
 

811

ఈ సీజన్ లో కాకరకాయ, బీరకాయ, సొరకాయ, టిండా వంటి కూరగాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. 

911

ఆరోగ్యకరమైన కూరగాయలతో పాటుగా అల్లం, వెల్లుల్లి, పుసుపును పుస్కలంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలతో పోరాడుతుంది. 
 

1011

సీజనల్ ఫ్రూట్ జ్యూస్ లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో సిట్రస్ ఫ్రూట్ అయిన నిమ్మ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అల్లం టీ, కాషాయం వంటివి తీసుకున్నా సీజనల్ సమస్యలు తొలగిపోతాయి. 

1111

డ్రై ఫ్రూట్స్ (Dry fruits)

డ్రై ఫ్రూట్స్ లల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్, బాదం పప్పులు వంటి డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాల రోగాలతో పోరాడుతాయి. ఇవి జీర్ణవ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి. పిస్తా, జీడిపప్పులు ఈ సీజన్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

 

Read more Photos on
click me!

Recommended Stories