Love Affair:లవ్ ఎఫైర్లతో హాట్ టాపిక్ గా మారిన సెలబ్రెటీలు వీరే...!

First Published | Jul 23, 2022, 11:48 AM IST

ఆ లవ్ ని పెళ్లి దాకా తీసుకువెళ్లిన వారు ఉన్నారు. మరి కొందరు.. అక్కడితో బ్రేకప్ చెప్పి.. మరొకరి ప్యాచప్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే.. తమ ఎఫైర్లతో హాట్ టాపిక్ గా మారిన చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. 

malaika

బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త లవ్ ఎఫైర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొందరు.. ఆ లవ్ ని పెళ్లి దాకా తీసుకువెళ్లిన వారు ఉన్నారు. మరి కొందరు.. అక్కడితో బ్రేకప్ చెప్పి.. మరొకరి ప్యాచప్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే.. తమ ఎఫైర్లతో హాట్ టాపిక్ గా మారిన చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. వారెవరో ఓసారి చూసేద్దామా...

1.అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి..

అక్షయ్ కుమార్ ప్రస్తుతం ట్వింకిల్ ఖాన్న ను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే.. ట్వింకిల్ ఖన్నా కి ముందు ఆయన ఇద్దరితో ప్రేమలో ఉన్నారు. ముందు రవీణా టాండన్ తో రిలేషన్ లో ఉన్నారట. శిల్పా శెట్టి కోసం ఆమెను వదిలేశారు. చాలా కాలం శిల్పా శెట్టి, అక్షయ్ ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా వేర్వేరు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు.
 


2.మలైకా అరోరా, అర్జున్ కపూర్..

మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారు అనే విషయం మనకు తెలిసిందే. మలైకా విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ తో రిలేషన్ మొదలుపెట్టింది అని అందరూ అనుకున్నారు. కానీ.. అర్జున్ తో రిలేషన్ కారణగానే మలైకా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే పుకారు కూడా ఉంది. వీరిద్దరికీ వయసులో 12 సంవత్సరాల తేడా ఉండటం గమనార్హం.

3.ఆదిత్య చోప్రా, రాణీ ముఖర్జీ..
ఆదిత్య చోప్రా, రాణీ ముఖర్జీ లు చాలా సంవత్సరాల పాటు సీక్రెట్ గా లవ్ ఎఫైర్ పెట్టుకున్నారు. ఆదిత్య చోప్రా కి గతంలోనే వివాహమైంది. ఎమినిది సంవత్సరాల తర్వాత.. భార్యకు విడాకులు ఇచ్చి.. 2014లో రాణి ముఖర్జీని వివాహం చేసుకున్నాడు.
 

4.ఆదిత్య పంచోలీ, కంగనా రనౌత్..
సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో కంగనా రనౌత్ తో ఆదిత్య పంచోలీ ఎఫైర్ పెట్టుకున్నాడు. అప్పటికే ఆదిత్య పంచోలీకి  జరీనా వాహేబ్ తో వివాహం అయింది. అయినా కూడా కంగనాతో ఎఫైర్ కొనసాగించారు. ఆ తర్వాత పబ్లిక్ తెలుస్తుందని దానిని అక్కడితో ముగించేశారు.

5.గోవింద, రాణి ముఖర్జీ..
వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనే విషయం పబ్లిక్ గానే తెలిసిపోయింది. 2000 సంవత్సరంలో రాణీ ముఖర్జీ, గోవింద ఒకే గదిలో ఓ జర్నలిస్ట్ కి దొరికిపోయాడు. దీని కారణంగా గోవింద కీ ఆయన భార్య సునీతకు మధ్య చాలా పెద్ద గొడవలే జరిగాయట. ఆ తర్వాత రాణీ ముఖర్జీ.. గోవింద కు దూరంగా ఉంటూ వచ్చిందట. దానికి కారణంగా కూడా గోవింద భార్య సునీతేనట. అప్పటి తో వారి రిలేషన్ కి పులిస్టాప్ పడింది.
 


6.శ్రీదేవి, మిథున్ చక్రవర్తి..
 రిపోర్ట్స్ ప్రకారం తేలిన విషయం ఏమిటంటే... మిథున్ చక్రవర్తి, శ్రీదేవి సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారట.  ఆ సమయంలో మిథున్ చక్రవర్తి యోగితా ని పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లి విషయం తెలిసి... యోగితా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందట. దీంతో.. శ్రీదేవి, మిథున్ విడిపోవాల్సి వచ్చిందట.
 

7.సుస్మితా సేన్, అనీల్ అంబానీ..
అనిల్ అంబానీ నటి టీనా ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అంతకముందు అనిల్ అంబానీ సుస్మితా సేన్ తో డేటింగ్ చేశారట. ఆమె అప్పట్లోనే 22 క్యారెట్ల డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారట.
 

Latest Videos

click me!