Migraine: వీటిని తింటే మైగ్రేన్ తలనొప్పి మరింత ఎక్కువ అవుతుంది జాగ్రత్త..

Published : Jun 25, 2022, 01:56 PM IST

Migraine: తలనొప్పిని భరించడం చాలా కష్టం. అందులో ఒకసైడు మాత్రమే వచ్చే.. మైగ్రేన్ తలనొప్పి ఇంకా డేంజర్. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే మైగ్రేన్ తలనొప్పి వచ్చేవాళ్లు కొన్ని ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

PREV
17
Migraine: వీటిని తింటే మైగ్రేన్ తలనొప్పి మరింత ఎక్కువ అవుతుంది జాగ్రత్త..

మనం తినే ప్రతి ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలు తక్షణ ప్రభావాన్ని చూపితే..  మరికొన్ని దీర్ఘకాలంలో ప్రభావాన్ని చూపుతాయి. చెడు ఆహారపు అలవాట్లు చెడు ఆరోగ్యానికి దారితీస్తాయి. ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.  వాటిలో మైగ్రేన్ కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మంది ఈ మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. 
 

27

మైగ్రేన్ నొప్పిని  ఔషధాల ద్వారా నయం చేయలేం. మీ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవడం ద్వారానే దీనిని నయం చేసుకోవచ్చు. మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటికి రుచిగా అనిపించినవి కాకుండా.. మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. మైగ్రేన్ బాధితులు తినకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

37

Cheese

Cheese ను మైగ్రేన్ బాధితులు అస్సలు తినకూడదు.  Aged cheese లో టైరామిన్ (Tyramine)ఉంటుంది. ఇది మైగ్రేన్ కు దారితీస్తుంది. Cheese ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచుతారు. అటువంటి జున్నును Aged cheese అంటారు. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఈ Cheese తింటే చాలా బాధపడాల్సి వస్తుంది.

47

కాఫీ (Coffee)కి దూరంగా ఉండాలి

సాధారణంగా తలనొప్పి వచ్చినప్పుడు టీ, కాఫీ తాగుతాం. ఇది ఉపశమణాన్ని కలిగిస్తుంది.  కానీ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీని తాగకపోవడమే మంచిది. మైగ్రేన్ నొప్పిలో కాఫీ తాగడం వల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాఫీలో అధిక మొత్తంలో లభించే కెఫిన్ మెదడు నరాల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఈ కారణంగా మెదడులో రక్త ప్రసరణ మందగిస్తుంది. అంతేకాదు ఇది తల నొప్పిని లేదా తల ఒకసైడు నొప్పిని మరింత పెంచుతుంది.  అందుకే మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు కాఫీని తాగకపోవడమే మంచిది. 
 

57

చాక్లెట్ (Chocolate)

చాక్లెట్స్ ప్రతి ఒక్కరికీ ఇష్టముంటుంది. కానీ మైగ్రేన్ తో బాధపడుతున్న వ్యక్తికి ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే చాక్లెట్ లో ఉండే కెఫిన్ (Caffeine), బీటా-ఫినైలెథైలమైన్ (Beta-phenylethylamine)రక్త నాళాలను విస్తరింపజేస్తాయి. తద్వార మైగ్రేన్ నొప్పి రావడం ప్రారంభమవుతుంది. 

67
citrus fruits

సిట్రస్ పండ్లు (Citrus fruits)

సిట్రస్ పండ్లను తిన్నా.. మైగ్రేన్ నొప్పి మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి తలనొప్పి వస్తే నిమ్మరసం తాగుతుంటారు. కానీ మైగ్రేన్ నొప్పి ఉన్నావాళ్లు లెమన్ వాటర్ ను తాగకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సిట్రస్ పండ్లు మైగ్రేన్లకు ప్రమాదకరం. నారింజ, నిమ్మకాయలు, కివి వంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచివిగా పరిగణించబడతాయి. ఈ పండ్లన్నింటిలోనూ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కానీ మైగ్రేన్ తో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
 

77

ప్రారంభ మైగ్రేన్ల లక్షణాలు

మైగ్రేన్ లక్షణాలు తెలిస్తే.. దీని నుంచి బయటపడటం సులువు అవుతుంది. మైగ్రేన్ ఉన్న వ్యక్తులకు ఆహార కోరికలు, అలసట, బలహీనత, నిరాశ, అధిక రక్తపోటు, మెడ, కడుపు బిగుతుగా ఉండటం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ వెలుతురును చూడలేరు. అలాగే ఎక్కువ శబ్దం వింటే చికాకు పడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories