Green Chilli Benefits: పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

Published : Jun 25, 2022, 12:50 PM ISTUpdated : Jun 25, 2022, 12:54 PM IST

Green Chilli Benefits: పచ్చిమిరపకాయలను మన రోజు వారి వంటలో భాగం చేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి బరువును తగ్గించడంతో పాటుగా.. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

PREV
112
 Green Chilli Benefits: పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

పచ్చి మిరపకాయతో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఇది లేని కూర అసంపూర్ణంగానే అనిపిస్తుంది. కేవలం రుచికోసమే వాడే పచ్చి మిరపకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎన్నో రోగాలను నయం చేస్తాయి. 

212

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:  ఊబకాయం కారణంగా ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఊబకాయులు పచ్చిమిరపకాయలు తింటే బరువు పెరిగే సమస్య నుంచి బయపడతారు. 
 

312

కళ్లకు మేలు చేస్తుంది:  పచ్చిమిర్చి కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి అలాగే కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది. పచ్చి మిరపకాయల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధనలో తేలింది. పచ్చిమిర్చిలో ఉండే ఈ గుణాలు, పోషకాలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 

412

క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది:  మిరపకాయలతో క్యాన్సర్ ను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని అంతర్గత భాగాలను శుభ్రపరచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే శరీరంలో ఉండే  ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే క్యాన్సర్ అనేది ఒక వ్యాధి. దీనిని దూరంగా ఉండటానికి మనం వైద్యుడి సలహా తీసుకోవాలి.
 

512

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది.  ఇది గుండెను ఆరోగ్యంగా చేస్తుంది. ఈ సమ్మేళనం గుండె జబ్బుల సమస్యను తొలగించి, గుండెకు రక్షణ కల్పించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

612

చర్మానికి మేలు:  విటమిన్-ఇ అధికంగా ఉండే పచ్చిమిర్చి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. దీన్ని తినడం చర్మం ఎల్లప్పుడూ తాజాగా, అందంగా ఉంటుంది.
 

712

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పచ్చి మిరపకాయలు జీర్ణ ప్రక్రియ సజావుగా సాగడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. పరిశోధన ప్రకారం.. గ్రీన్ చిల్లీస్ జీర్ణశయాంతర రుగ్మతపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. వాస్తవానికి Gastrointestinal disorders అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. 

812

జలుబును తగ్గిస్తుంది: మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ (Capsaicin) మన ముక్కులో ఇప్పటికే ఉన్న శ్లేష్మ పొరలను ఉత్తేజపరుస్తుంది. ఇది మూసుకుపోయిన శ్వాస వ్యవస్థను తెరుస్తుంది. అలాగే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

912

రక్తపోటును నియంత్రిస్తుంది: అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయి. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ హైపర్టెన్సివ్ (Anti-hypertensive)లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో ఈ లక్షణం ప్రయోజనకరంగా ఉంటుంది.

1012

పచ్చిమిర్చి ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు: పచ్చిమిరపకాయల తినడం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. రోజుకు ఎంత మొత్తంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1112

Journal of Nutrients China లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. పచ్చి మిరపకాయలు చాలా నష్టాలను కలిగి ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ పచ్చిమిరపకాయలను తీసుకోవడం వల్ల చిత్తవైకల్యం (Dementia) వంటి రోగాలకు దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

1212

పచ్చిమిర్చిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ కూడా పెరుగుతాయి. అలాగే పచ్చిమిర్చిని ఎక్కువగా తినడం వల్ల కడుపులో ఏర్పడే రసాయన ప్రతిచర్య వల్ల కడుపులో దురద, వాపు మొదలైనవి వస్తాయి. ఎసిడిటీకి కారణం పచ్చిమిర్చి కూడా కావచ్చు. కాబట్టి దీనిని పరిమిత మొత్తంలోనే తినాలి. 

Read more Photos on
click me!

Recommended Stories