ఆ సమస్యలు రాకూడదంటే పురుషులు ఈ ఆహారాలను తప్పకుండా తినాలి

First Published | Nov 11, 2022, 11:56 AM IST

ఆడవారికి, మగవారికి వేరు వేరు పోషకాలు.. వేర్వేరు పరిమాణాల్లో అవసరమవుతాయి. ముఖ్యంగా ఆడవారితో పోల్చితే మగవారికే దీర్ఘకాలిక రోగాలు ఎక్కువొస్తయ్. అందుకే వీళ్లు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

చాలా అధ్యయనాల ప్రకారం.. ఆడవారికంటే, మగవారికే ఎక్కువగా దీర్ఘాకాలిక వ్యాధులు వస్తాయి. గుండెకు సంబంధించిన రోగాలు, మానసిక రుగ్మతలు, క్యాన్సర్, డయాబెటీస్, కాలెయ వ్యాధులు, శ్వాసకోస వ్యాధులు పురుషులకు తరచుగా వస్తుంటాయి. ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. వీటిద్వారా మగవారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అవేంటంటే.. 

nuts

గింజలు

గింజల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యకరమైన కొవ్వు. మన శరీరానికి చాలా అవసరం కూడా. గింజల్లో మోనోశాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లో కూడా మంచి కొవ్వులు ఉంటాయి. 
 


కొవ్వు చేపలు

సాల్మన్, హాలిబట్, సార్డినెస్ , ట్యూనా వంటి చేపలు కొవ్వు చేపలకు మంచి ఉదాహరణలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ మంది పురుషుల మరణానికి కారణమైన గుండె జబ్బుల నుంచి  రక్షిస్తాయి. ప్రతి వారం రెండు సేర్విన్గ్స్ కొవ్వు చేపలను తింటే గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం తగ్గుతుంది. 
 

అల్లం

అల్లం కమ్మని వాసన వస్తుంది. అంతకు మించి ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని ప్రతి ఒక్క కూరలో వేస్తుంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టైతే అల్లం శరీర మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకుంటే.. వ్యాయామం చేయడం వల్ల అయిన కండరాల గాయాలు తొందరగా తగ్గిపోతాయి. 
 

పుచ్చకాయ

పుచ్చకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫైబర్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే ఉబ్బసం లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే కొన్ని ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 
 

తృణధాన్యాలు

తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారాల ద్వారా విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్ లు అందుతాయి. ఇవి బరువును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. ఇవి ఆకలి కోరికలను చాలా వరకు తగ్గిస్తాయి. తృణధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ను, మంటను నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

గుడ్లు

గుడ్డు ప్రోటీన్ లో అమైనో ఆమ్లం ల్యూసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. ఇది ఇతర ప్రోటీన్ల కంటే బలమైంది. గుడ్లలోని ప్రోటీన్లు ఆకలి కోరికలను తగ్గించడానికి సహాయపడతాయి. శరీర శక్తి స్థాయిలు పెరిగేందుకు సహాయపడతాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ఎలాంటి అనారోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉండదు. 

Latest Videos

click me!