కోడిగుడ్డుతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ మేము కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఇచ్చాము. చికెన్, మటన్ పికిల్ పెట్టుకున్నట్టే కోడి గుడ్డు పికెల్ కూడా పెట్టుకోవచ్చు.
పచ్చళ్ళు అంటే ఎంతో మందికి ఇష్టం. అందులోనూ స్పైసీగా చేసుకుంటే వాటి రుచి అదిరిపోతాయి. మీరు చికెన్ పికిల్, మటన్ పికిల్ తిని ఉంటారు.. అలాగే కోడిగుడ్డు పికిల్ కూడా అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ పచ్చళ్లలో ఇప్పుడు కోడిగుడ్డు నిల్వ పచ్చడి కూడా చేరిపోయింది. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే వదల్లేరు. ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది. రెసిపీ కూడా చాలా సులువు.
25
కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్డులో పచ్చడి చేసేందుకు చాలా తక్కువ పదార్థాలు అవసరం పడతాయి. ఇందుకోసం ముందుగానే మీరు నాలుగు కోడిగుడ్లను తీసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ, కారం ఐదు స్పూన్లు, నూనె ఆరు స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా సిద్ధం చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అతి ముఖ్యమైనది. కాబట్టి మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా సిద్ధం చేసుకుని వండేందుకు రెడీ అయిపోవాలి. తగినంత నీళ్లు కూడా అవసరం.
35
కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెసిపీ ఇలా
ఎగ్స్ తో పచ్చడి చేయడం చాలా సులువు. ఇందుకోసం మీరు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. అలాగే ఒక పావు కప్పు నీళ్లను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే కోడిగుడ్లను కొట్టాలి. ఒక స్పూన్ తీసుకొని ఆ మిశ్రమమంతా కలిసేలా బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీని ఎలా ఆవిరి మీద ఉడికించుకుంటారో.. అలా దీన్ని కూడా ఆవిరి మీద ఉడికించాలి. దాని వల్ల కోడి గుడ్డు మిశ్రమం గట్టిగా అవుతుంది. అలా ఆవిరి మీద ఉడికించాక కోడిగుడ్డు మందపాటి ఆమ్లెట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని తీసి చల్లార్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలోని ఈ కోడి గుడ్డు ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు రంగు మారేవరకు వేయించి ఆ తర్వాత కారం వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆశ్రమం పూర్తిగా చల్లారాక నిమ్మరసం కలుపుకోవాలి. అంతే కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని తడి తగలకుండా చూసుకోవాలి. ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే మీరు నెల రోజులు పాటు తినవచ్చు.
55
తాజా గుడ్లతోనే చేయండి
నాన్ వెజ్ ను ఇష్టపడేవారు ప్రతిరోజూ ఈ కోడి గుడ్డు పచ్చడిని తినవచ్చు. వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు పికిల్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. కోడిగుడ్డు పికిల్ కొనే కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. కొందరు పాడైన కోడిగుడ్లతో దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంట్లోనే తాజా గుడ్లతో ఈ కోడి గుడ్డు పికిల్ తయారు చేసేందుకు ప్రయత్నించండి.