గ్యాస్ ఆదా చేసే ట్రిక్‌.. తక్కువ బియ్యమని స్టవ్‌పై అన్నం వండుతున్నారా.? రైస్ కుక్క‌ర్‌లోనే ఇలా..

Published : Mar 14, 2026, 03:31 PM IST

LPG Cylinder: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి సమయంలో గ్యాస్‌ను పొదుపు చేసుకోవడం చాలా అవసరం. గ్యాస్‌ను ఆదా చేసుకునే అలాంటి ఒక ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పెరిగిన గ్యాస్ క‌ష్టాలు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావం సామాన్యుడి వంటగదిపై పడుతోంది. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెర‌గ‌డ‌మే కాకుండా, డెలివరీ కూడా సమయానికి అందడం లేదు. ఇలాంటి తరుణంలో గ్యాస్‌ను వీలైనంత వరకు ఆదా చేయడం ప్రతి ఇంటా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ వనరులను వాడుకుంటూ వంట చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది.

25
తక్కువ అన్నం కోసం గ్యాస్ వాడాల్సిన పనిలేదు

చాలామంది ఒక గ్లాసు లేదా అర గ్లాసు బియ్యం వండాల్సి వచ్చినప్పుడు, ఎలక్ట్రిక్ కుక్కర్ గిన్నె పెద్దగా ఉంటుందని భావించి గ్యాస్ స్టవ్‌ను ఉప‌యోగిస్తారు. దీనివల్ల విలువైన గ్యాస్ ఖర్చవుతుంది. కానీ మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ను ఉపయోగించే తక్కువ పరిమాణంలో అన్నాన్ని కూడా పర్‌ఫెక్ట్‌గా వండుకోవచ్చు. దీనికోసం కుక్కర్ లోపల నేరుగా బియ్యం పోయాల్సిన అవసరం లేదు.

35
రైస్ కుక్కర్‌లో గిన్నె ట్రిక్

ఇందుకోసం ముందుగా మీరు వండాలనుకున్న తక్కువ పరిమాణంలో ఉన్న బియ్యాన్ని (అర గ్లాసు లేదా ఒక గ్లాసు) ఒక చిన్న స్టీల్ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ బియ్యానికి తగినట్టుగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి.

45
కుక్కర్‌ను ఎలా సిద్ధం చేయాలి?

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోపల ఉండే పెద్ద అల్యూమినియం గిన్నెలో సుమారు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న చిన్న స్టీల్ గిన్నెను (బియ్యం, నీళ్లు ఉన్నది) నేరుగా ఆ నీళ్లలో ఉంచాలి. ఆపై స్టీల్ గిన్నెపై మూత పెట్టి, కుక్కర్ మెయిన్ మూతను కూడా మూసివేయాలి. కుక్కర్ స్విచ్ ఆన్ చేసి 'కుకింగ్' మోడ్‌లోకి మార్చాలి.

55
అన్నం రెడీ, గ్యాస్ ఆదా

సుమారు 30 నుంచి 35 నిమిషాల్లో కుక్కర్ ఆటోమేటిక్‌గా 'వార్మ్' మోడ్‌లోకి వస్తుంది. అప్పుడు మూత తీసి చూస్తే, స్టీల్ గిన్నెలో అన్నం చాలా చక్కగా, పొడిపొడిగా ఉడికి ఉంటుంది. కుక్కర్ గిన్నె అడుగు భాగం మాడిపోకుండా ఉండటమే కాకుండా, కడగడం కూడా చాలా సులభం అవుతుంది. ఈ చిన్న ట్రిక్ పాటించడం వల్ల గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా, తక్కువ అన్నం వండేటప్పుడు పడే ఇబ్బంది కూడా తప్పుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories