వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు వెళ్లేందుకు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవే!

Navya G   | Asianet News
Published : Feb 05, 2022, 11:35 AM IST

ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే (Valentine's Day) కి ప్రేమికులు సరదాగా గడపడానికి టూర్ ను ప్లాన్ చేస్తుంటారు. అయితే మన భారతదేశంలో ఫిబ్రవరిలో సరదాగా గడపడానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి వాతావరణం ప్రేమికుల (Lovers) మనసులో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఫిబ్రవరి నెల సరైనది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా సందర్శనీయ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..   

PREV
16
వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు వెళ్లేందుకు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవే!

కుమారకోం: కుమారకోం (Kumarakom) కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆకర్షణీయ ప్రదేశం. వీకెండ్ సెలవులలో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనువైనది. ఈ ప్రాంత సందర్శన ప్రేమికులకు మధురానుభూతిని (Sweetness) కలిగిస్తుంది. చిన్న చిన్న ద్వీపాల సమూహం కలిగిన ఈ ప్రదేశం కొట్టాయం కి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వాతావరణం అందమైన ఆకుపచ్చని ప్రకృతి అందాలతో, నీటి ప్రవాహాలతో  పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుంది.
 

26

గోవా: గోవా (Goa) ప్రేమ జంటలు సందర్శించడానికి వీలుగా ఉన్న అందమైన, అద్భుతమైన ప్రదేశం. భారతదేశానికి పశ్చిమంగా ఉన్న గోవా కర్ణాటక, మహారాష్ట్ర, అరేబియా సముద్రాన్ని సరిహద్దులుగా కలిగి ఉంది. గోవాకు ప్రధాన ఆదాయ వనరుగా అనేక బీచ్ లు ఉన్నాయి. ఈ బిసి సందర్శన పర్యాటక ప్రేమికులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. గోవాలో ఆల్కహాల్ (Alcohol) చౌకగా దొరుకుతుంది. ఇక్కడి సీ ఫుడ్స్, రోడ్ సైడ్ పబ్బులు, షాపింగ్ ఇలా ఎన్నో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. గోవా సందర్శన మీకు తప్పక నచ్చుతుంది.

36

ఉదయపూర్: ఉదయపూర్ (Udaipur) రాజస్థాన్ లో ఉంది. ఈ ప్రదేశంలో అందమైన సరస్సులు, కోటలు, మందిరాలు, అభయారణ్యాలు (Sanctuaries) ఇలా ఎన్నో ప్రదేశాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి కనుక ఫిబ్రవరిలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు చాలా మంది ఇష్టపడతారు.
 

46

కొడైకెనాల్: తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ అందమైన హిల్ స్టేషన్ కొడైకెనాల్ (Kodaikanal). ఈ హిల్ స్టేషన్  సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రేమికులకు, హనీమూన్ (Honeymoon) జంటలకు ఇది అనువైన ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు, పచ్చని వాతావరణం  పర్యాటక ప్రేమికులకు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

56

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన సిమ్లా (Shimla) ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 2202 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ  ప్రదేశంలో  ఐస్ స్కేటింగ్, ట్రెక్కింగ్, మౌంట్ బైకింగ్ వంటి సాహస క్రీడలతో ప్రసిద్ధి. ఇక్కడి అందమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షించేలా (To attract) ఉంటుంది.
 

66

ఊటీ: ఊటీని (Ooty) ప్రేమ జంటలు హనీమూన్ జంటలను ఎక్కువగా సందర్శించడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశాన్ని వేసవి సెలవుల్లో గడపడానికి పర్యాటక ప్రియులు లక్షల్లో వస్తుంటారు. ఇక్కడి అందమైన సరస్సులు కొండలు పూల తోటలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంత సందర్శన ఫిబ్రవరిలో (February) అనువైనది.

click me!

Recommended Stories