మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? వెంటనే ఈ ఫుడ్ ను తినిపించి చూడండి..

Published : Feb 05, 2022, 09:49 AM IST

Childrens: కొంతమంది పిల్లలు తమ వయసుకు తగ్గట్టు బరువు పెరగరు. దాంతో వారు తమ వయస్సు కన్నా చిన్న వారిగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ సమస్య మూలంగా పిల్లలు అవమానకరంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ సమస్యతో వారు మానసికంగా క్రుంగిపోయే ప్రమాదం ఉంది.   

PREV
16
మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? వెంటనే ఈ ఫుడ్ ను తినిపించి చూడండి..

Childrens: మారుతున్న జీవనశైలి కారణంగా మనల్ని అనేక రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక ఇందులో వయస్సు మీద పడిన వారు, చిన్నపిల్లలే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తమ పిల్లలలను ఆరోగ్యంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నారు. కానీ పిల్లలకిచ్చే ఫుడ్ విషయంలోనే తల్లిదండ్రులు ఎక్కువగా ఆంధోళన చెందుతున్నారు. ఎందుకంటే.. పిల్లలకు ఏ ఆహారం మంచిది? ఎలాంటి ఆహారం పెడితే అనారోగ్య సమస్యలు వస్తాయోనంటూ ఆందోళనకు గురవుతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలకు జంక్ ఫుడ్ నే ఎక్కువగా తినిపిస్తున్నారు. ఈ ఫుడ్ వల్ల పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 

26

ఈ సంగతిని పక్కన పెడితే ప్రస్తుతం చాలా మంది పిల్లలు తక్కువ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్ వారి ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు బరువు పెరగకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. కొంతమంది పిల్లలు అనారోగ్యం కారణంగా వెయిట్ పెరగకుంటే.. మరికొంతమంది పిల్లలు ఫుడ్ ను తక్కువగా తీసుకుంటారు. దీంతో కూడా పిల్లలు బరువు పెరగరు. ఇలాంటి పిల్లలను వీలైనంత తొందరగా వైద్యులకు చూపించాలి. అంతేకాదు.. వారికిచ్చే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల మీ పిల్లలు తొందరగా బరువు పెరగుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

36

అరటిపండు: అరటిపండులో అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి. కాగా పిల్లలు కూడా అరటిపండును ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల బక్కగా ఉండే పిల్లలు వెయిట్ పెరుగుతారు. అరటిని తినకపోతే అరటిపండు షేక్ లేదా ఓట్స్ తో కలిపి కూడా తినిపించొచ్చు.

46


గోధుమ గంజి: గోధుమలతో చేసిన ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలకు ఎంత సహాయపడతాయి. ఒక వేళ మీ పిల్లలు గోధుమ రొట్టెలు తినగలిగితే.. ప్రతిరోజూ వారికి అవి చేసి పెట్టండి. అలాగే గోధుమ గంజిలో పచ్చి వెజిటేబుల్స్ కలిపి తినిపిస్తే కూడా పిల్లలు బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు దీనివల్ల మీ పిల్లలు బలంగా కూడా అవుతారు.

56

పాల ఉత్పత్తులు:  పాల ఉత్పత్తుల్లో కొవ్వు ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అంతేకాదు ప్రోటీన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ పిల్లలు బరువు పెరిగేందుకు బాగా సహాయపడతాయి. అంతేకాదు.. వీటిలో ఉండే కాల్షియం వల్ల పిల్లలు ఎముకలు బలంగా మారతాయి. ఒకవేళ మీ పిల్లలు పాలు తాగకపోతే పెరుగు, వెన్న, పనీర్ వంటివి తినిపించినా మంచి ఫలితం ఉంటుంది. 

66

చికెన్: చికెన్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలి. ఇవి కండరాల బలోపేతానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు వీటిలో లభించే ప్రోటీన్లు కొత్త కణాల ఏర్పాటుకు ఎంతో సహాయపడతాయి. వారానికి రెండు సార్లు చికెన్ తినిపిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చికెన్ సూప్ తో కూడా సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల మీ పిలల్లు తొందరగా వెయిట్ పెరుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories