జీవితమేంటి ఇంత బోరింగ్ ఉంది? ఒక కిక్కు లేదు పాడూ లేదంటూ ఫీలవుతున్నారా? అయితే ఈ పనులను చేసేయండి..

Published : Feb 05, 2022, 10:45 AM IST

Things to Do: రోజు రోజుకు ఢిపరెంట్ ఉంటేనే జీవితం మీద ఆసక్తి పుడుతుంది. అదే.. రోజూ ఒకేలా గడిస్తే.. కొన్ని రోజులకు మనమీద మనకే బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తే మీ లైఫ్ లో మీరు ఎన్నటికి మర్చిపోలేని విశేషాలుగా మిగిలిపోతాయి. అంతేకాదు.. కిక్కు అంటే ఇదేరా అని చెప్పుకుంటారు.

PREV
17
జీవితమేంటి ఇంత బోరింగ్ ఉంది? ఒక కిక్కు లేదు పాడూ లేదంటూ ఫీలవుతున్నారా? అయితే ఈ పనులను చేసేయండి..

Things to Do: మనం జీవించే విధానం ఎలా ఉండాలో తెలుసా.. మనల్నిచూసి మన పక్కవారు బతికితే ఇలా బతకాలిరా అనే విధంగా ఉండాలి. మనం బ్రతికే విధానం మన ఫ్యూచర్ గురించి కలలు గనేలా ఉంటాలి. కానీ నిరాశ పరిచేలా ఉండకూడదు. జీవితంలో అన్నీ ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది. కానీ ప్రస్తుతం చాలా మంది మరమనుషులుగా జీవిస్తున్నారు. ఇలాంటి వారికి ఫ్యూచర్ గురించి ఆలోచనుండదు. ఇలా బతకాలన్నా కోరికా ఉండదు. కానీ కొంతమంది మాత్రం వారు చేసే ప్రతి మూమెంట్ డిఫరెంట్ గా ఉండాలని ఆశపడుతుంటారు. వారిపై వారికి బోరింగ్ రాకుండా.. కిక్కు కోసం కొన్ని కొన్ని పనులను చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారిపై వారి నమ్మకం ఏర్పడుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సంతోషంగా ప్రయాణించగలుగుతారు.

27

సాధారణంగా చాలా మందికి తమ లైఫ్ లో ఏదో మిస్ అయ్యిందన్న భావన ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఎంత పనిచేస్తున్నా ఏదో కోల్పోయామనే ఆలోచనలోనే ఉంటారు. బోరింగ్ లైఫ్.. చీ దీనమ్మ జీవితం.. సంతోషమనేదే లేకుండా పోయిందేంటి అంటూ తెగ ఫీలైపోతుంటారు. అలాంటి వారు ఈ పనులను చేస్తే వారి లైఫ్ లో కిక్కే కిక్కు ఉంటుంది. అవన్నీ మీ జీవితాన్ని సంతోషకరంగా, మరింత ఉత్సాహంగా మారుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

37


పర్వతారోహణలు:  జీవితంమీద విరక్తి పుట్టినప్పుడు అప్పుడప్పుుడు స్నేహితులతో కలిసి మీకు దగ్గర్లో ఉండే పర్వతాలు లేదా కొండలపై ఎక్కిండి. లేదంటే పేరు ప్రఖ్యాతలు పొందిన పర్వతాలపై కి ట్రెక్కింగ్ చేయండి. మీకు తెలుసా.. ప్రకృతి మనకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాదు.. పర్వతారోహణతో మనలో సరికొత్త ఉత్తేజం వస్తుంది. మీపై మీకు పట్టుదల కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నిరాశ మటుమాయం అవుతుంది. 

47

సోలో ట్రిప్: ఎప్పుడో ఒక్క సారన్నా.. ట్రిప్ కు సోలో గా వెళ్లండి. ఇలా వెళితే.. మీ గురించి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేకాదు ఒంటరిగా ట్రిప్ కు వెళ్లడం వల్ల మీపై మీకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా సోలో ట్రిప్ వల్ల మీలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్లేంటో తెలుసుకోగలుగుతారు. ఖచ్చితంగా సోలో ట్రిప్ వల్ల మీకు కావాల్సినంత కిక్కు దొరుకుతుంది. నా అనుకున్న వారు నీ చుట్టూ లేకపోతే జీవితం ఎలా ఉంటుందన్న విషయాలనైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు. 

57

మీ కోసం ఓ కానుక: ఎప్పుడూ ఇతరులకేనా బహుమతులిచ్చే. అప్పుడప్పుడు మీ కోసం మీరు బహుమతులను ప్రెజెంట్ చేసుకోండి. ఒక ఖరీదైన బహుమతి కొనుక్కొని మీకు ఇచ్చుకోండి. అప్పుడెంత సంతోషం కలుగుతుందో మాటల్లో చెప్పలేరు.

67

ప్రతి ఏడాది: ఆరో నెలలకోసారో లేకపోతే ఒక ఏడాదికోసారైనా మీకు తెలియని , భాష రాని ప్లేసెస్ కు ట్రిప్ గా వెళ్లేలా చూసుకోండి. ఆ పర్యటన మీకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా చెప్పలేనంత ఎంజాయ్ ను పొందుతారు. అంతేకాదు ఈ పర్యటన మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. అంతేకాదు సూపర్ కిక్కు కూడా లభిస్తారు. కానీ ఇలాంటి ట్రిప్ లకు మీరు సోలోగానే వెళ్లాలి.   

77

ఫుడ్: ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటే కూడా లైఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే సమయాన్ని కుదుర్చుకుని మరీ కొత్త కొత్త రుచులను ఆస్వాధిస్తూ ఉండాలి. దీనికోసం ఒక ప్రణాళికను సిద్దం చేసుకోండి, యూరోపియన్, కాంటినెంటల్ వంటి రకరకాల ఆహార పదార్థాలను అప్పుడప్పుడు రుచి చూస్తే కూడా వచ్చే కిక్కే వేరబ్బా..  

click me!

Recommended Stories