Monkeypox : కోవిడ్ తర్వాత మంకీ ఫీవర్ (మంకీ పాక్స్) వ్యాప్తి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కెనడా తరువాత ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్, స్వీడన్, ఆస్ట్రేలియా మరియు నెదర్లాండ్స్ లలో కోతి జ్వరం ( Monkeypox ) నిర్ధారణ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. 12 దేశాల నుంచి 10 రోజుల్లో 92 మంకీ ఫీవర్ కేసులు నిర్ధారణ అయ్యాయి.