
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ యే మన ఆరోగ్యానికి మేలని చాలా మంది అంటూ ఉంటారు. నిజానికి తొలుత వడ్లు కొంచెం బ్రౌన్ కలర్ లోనే ఉంటాయి. కానీ అవి మిల్లింగ్ ప్రక్రియ ద్వారా దాని పొట్టు అలాగే బియ్యం పై పొర తొలగిపోతుంది. దీంతో బియ్యం తెల్లగా మారుతాయి. ఇవి బ్రౌన్ రైస్ కంటే భిన్నంగా ఉంటాయి. బ్రౌన్ రైస్ లో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు మరియు ఫైబర్ కంటెంట్ లు వైట్ రైస్ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. అందుకే తెల్లబియ్యం కంటే బ్రౌన్ రైస్ యే బెటర్ అంటుంటారు. మరి ఈ తెల్లబియ్యం ఆరోగ్యానికి మంచి చేస్తుందో.. చెడు చేస్తుందో తెలుసుకుందాం పదండి.
వైట్ రైస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు.. వైట్ రైస్ గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఈ గ్లూటెన్ అలెర్జీ, ఉదర సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అందులోనూ వైట్ రైస్ తేలికగా జీర్ణం అవుతుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తెల్ల బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో( stabilizing) సహాయపడుతుంది. తెల్ల బియ్యంలో పిండి పదార్థం, గ్లైసెమిక్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ ను సాధారణంగా ఏ ఆహారాలు రక్తంలో చక్కెరను ఎలా ప్రభావితం చేస్తాయనే దాని ఆధారంగా స్ట్రాటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. సోడాలు, పండ్ల రసాలు, తీపి అల్పాహారం, తృణధాన్యాలు, మిఠాయి, వైట్ బ్రెడ్ వైట్ రైస్ వంటి వాటిలో గ్లైసెమిక్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ ఆహారాలు ఇతర ఆహారాల కంటే రక్త స్థాయిలను సులభంగా పెంచుతాయి. కాలక్రమేణా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే .. అది బరువు పెరగడానికి, టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తుంది.
వైట్ రైస్ తేలికగా జీర్ణం అవుతుంది. ఏవైనా ధాన్యాలను సరిగ్గా తయారు ఉడికించకపోతే.. దాన్ని శరీరం జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. బ్రౌన్ రైస్ తో సహా అన్ని గింజల వెలుపలి పొరలో ఫైటిక్ యాసిడ్ అనే పోషకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. అయితే వైట్ రైస్ తినడం వల్ల ఆ సమస్య ఉండదు.
వైట్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇది ఎక్కువగా జంక్ ఫుడ్ లో ఉంటుంది. అయితే వైట్ రైస్ చాలా హైపోలార్జెనిక్ ఆహారం. దీనిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
వైట్ రైస్ దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. భారతదేశం యొక్క పురాతన వైద్య విధానం మరియు సాంప్రదాయ చైనీస్ వైద్యం, శీతలీకరణ ఆహారంగా భావించేవారు. అంతేకాదు అధిక వేడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.