ఆల్మండ్ బటర్, అరటిపండు: ఆల్మండ్ బటర్ (Almond Butter), అరటిపండు (Banana) హెల్తీ ఫుడ్ అయినా కూడా నిద్రలేమి సమస్యలు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం, మెలటోనిన్ సుఖ నిద్రను అందిస్తాయి. దీనికోసం మిక్సీ జార్ లో ఒక అరటి పండు గుజ్జు, కప్పు పాలు (Milk), ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ బటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పానీయాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే గాఢ నిద్రలోకి జారుకుంటారు.