Health News: కాలెయాన్నిఆల్కహాల్ ఒక్కటే కాదు.. ఇవి కూడా దెబ్బతీస్తయ్ జాగ్రత్త..

Published : Jun 17, 2022, 10:45 AM IST

Health News: ఆల్కహాల్ అతిగా తాగితే  కాలెయం (liver) దెబ్బతింటుందన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆల్కహాల్ (Alcohol) తో పాటుగా మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు కూడా కాలెయాన్ని దెబ్బతీస్తాయి. అవేంటంటే..  

PREV
18
Health News: కాలెయాన్నిఆల్కహాల్ ఒక్కటే కాదు.. ఇవి కూడా దెబ్బతీస్తయ్  జాగ్రత్త..

ఇతర అవయవాల మాదిరిగా కాలేయ ఆరోగ్యం (Liver health) కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 

28

కాలెయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రోజుకు 500 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. మనం తిన్న ఆహారం  జీర్ణం అవడానికి అవసరమయ్యే పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే మనం రక్తంలో ఉండే విషపదార్థాలను బయటకు తొలగిస్తుంది. అంతేకాదు మనం తినే, తాగే ప్రతి పదార్థాన్ని ప్రాసెస్ చేస్తుంది. 

38
liver

కాలెయం మన శరీర జీవక్రియ, సింథటిక్ విధుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో ఇది కీలకమైన భాగం కావడం వల్ల దీన్నిమనం ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు కాలెయాన్ని దెబ్బతీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

48
sugar

చక్కెర (Sugar):  చక్కెర వల్ల ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువగా  ఉంటాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో కాలెయం దెబ్బతినడం ఒకటి. శుద్ధి చేసిన షుగర్ ను ఎక్కువగా వాడటం వల్ల లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 

58
vitamin a

విటమిన్ ఏ వినియోగం: విటమిన్లు మన శరీరానికి ఎంతో అవసరం. అది కూడా అవసరమైన మేరకే. అందులో విటమిన్ ఎ కండ్ల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ విటమిన్ ఏ మన శరీరంలో ఎక్కువైతే కాలెయ వ్యాధులు వచ్చే అవకాశం  ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ విటమిన్ ఎ తాజా పండ్లు, కూరగాయలు. నారింజ, పసుపు, ఎరుపు పండ్లలో ఉంటుంది. 

68

తెల్ల పిండి తో చేసిన ఆహారాలు: తెల్లగా ఉండే పిండి ఎక్కువగా ప్రాసెస్ చేయబడి ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన పిండిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో తగ్గిపోతాయి. వీటిని తినడం వల్ల మన రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. White bread, పిస్తా, బిస్కెట్లు, పిజ్జా వంటి వాటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది. వీటిని తింటే కాలెయ సమస్యలు వస్తాయి. 

78

రెడ్ మీట్:  రెడ్ మీట్ వల్ల కలిగే ప్రయోజనాలు సంగతి పక్కనపెడితే.. దీన్ని తినడం వల్ల కలిగే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది అంత తొందరగా జీర్ణం కాదు. దీనివల్ల కాలెయం ఇబ్బందికి గురవుతుంది. ఎందుకంటే దీనిలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం  కాలెయానికి కష్టంగా ఉంటుంది. అదనపు ప్రోటీన్ల వల్ల కాలెయ వ్యాధులతో పాటుగా  మూత్రపిండాలు, మెదడుకు సంబంధించిన రోగాలు కూడా వస్తాయి. 

 

88

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్: ఒళ్లు నొప్పిలకు, తలనొప్పికి తరచుగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ మందు బిల్లలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. నొప్పి నుంచి కొంత సమయం ఉపశమనం కలిగించినా.. ఇవి కాలెయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వీటిని డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే ఉపయోగించండి. 

 

Read more Photos on
click me!

Recommended Stories