Lifestyle: ఆన్‌లైన్ డెలివ‌రీ బాక్స్‌లను చెత్త‌లో ప‌డేస్తున్నారా.? ఇలా ఆలోచేస్తే అద్భుతాలు చేయొచ్చు

Published : May 01, 2026, 10:15 AM IST

Lifestyle: ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిన తర్వాత ప్రతి ఇంట్లో కార్డ్‌బోర్డ్ బాక్స్‌లు కనిపిస్తున్నాయి. చాలామంది వీటిని వెంటనే పారేస్తారు. కానీ ఈ బాక్స్‌లు చిన్న చిన్న పనులకు చాలా ఉపయోగపడతాయి. కొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే వీటితో అద్భుతాలు చేయొచ్చు. 

PREV
17
చిన్న వస్తువుల కోసం ఒకే చోట స్టోరేజ్

ఇంటి లోపల తాళాలు, వాలెట్, గ్లాసెస్ వంటి చిన్న వస్తువులు ఎప్పుడూ ఎక్కడో పడిపోతుంటాయి. ఒక చిన్న బాక్స్‌ను దీనికోసం కేటాయిస్తే, అన్ని వస్తువులు ఒకేచోట ఉంటాయి. బయట నుంచి వచ్చిన వెంటనే వాటిని అందులో వేయడం అలవాటు చేసుకుంటే చిందరవందరం తగ్గుతుంది.

27
వైర్ల గజిబిజికి సింపుల్ సొల్యూషన్

చార్జర్లు, ఎక్స్‌టెన్షన్ బోర్డులు గజిబిజిగా కనిపిస్తుంటాయి. ఒక బాక్స్‌కు చిన్న రంధ్రాలు చేసి లోపల పవర్ బోర్డ్ పెట్టండి. బయట నుంచి వైర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో మీ టేబుల్ నీటిగా కనిపిస్తుంది.

37
ఫ్రిజ్‌లో చిన్న ప్యాకెట్లకు ఆర్గనైజర్

సాస్ ప్యాకెట్లు, చిన్న ఫుడ్ ఐటమ్స్ ఫ్రిజ్‌లో చెల్లాచెదురుగా ఉంటాయి. వాటిని ఒక బాక్స్‌లో పెట్టి ఒకే షెల్ఫ్‌లో ఉంచితే ఫ్రిజ్ తెరిచినప్పుడు నీటిగా కనిపిస్తుంది.

47
దుస్తుల‌ కోసం ప్రత్యేక బాక్స్

ఇంకా ఉతికని కానీ మళ్లీ వేసుకునే దుస్తులు చాలా ఇళ్లలో కుర్చీలపై ప‌డేస్తుంటారు. వాటిని వేరుగా ఒక బాక్స్‌లో పెట్టుకుంటే గది క్లీన్‌గా కనిపిస్తుంది.

57
సైడ్ టేబుల్ లేకపోతే బాక్స్‌తో పరిష్కారం

మంచం పక్కన టేబుల్ లేకపోతే, 2–3 బాక్స్‌లను ఒకదానిపై ఒకటి పెట్టి టేప్ చేయండి. ఇది తాత్కాలిక సైడ్ టేబుల్‌గా ఉపయోగపడుతుంది. ఫోన్, పుస్తకం, నీళ్లు పెట్టుకోవచ్చు.

67
డాక్యుమెంట్స్ కోసం సింపుల్ ఫైల్ సిస్టమ్

బిల్లులు, వారంటీలు, ముఖ్యమైన పేపర్లు తరచుగా మిస్ అవుతుంటాయి. ఒక బాక్స్‌ను విభజించి అందులో వర్గీకరించి ఉంచితే అవసరమైనప్పుడు వెంటనే దొరుకుతాయి.

అదనపు కిరాణా సరుకుల నిల్వ

వంటగదిలో అదనంగా ఉన్న బిస్కెట్లు, నూడుల్స్ వంటి వాటిని వేరుగా ఒక బాక్స్‌లో ఉంచితే కిచెన్ సర్దుగా ఉంటుంది. రోజూ వాడేవి, స్టాక్‌గా ఉంచేవి వేరుచేయడం సులభం అవుతుంది.

77
బాల్కనీ లేదా యుటిలిటీ ఏరియాలో స్టోరేజ్

పాత పేపర్లు, క్లీనింగ్ క్లాత్‌లు, ప్లాస్టిక్ కవర్లు వంటివి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా ఒక బాక్స్‌లో ఉంచండి. దీన్ని బాల్కనీ లేదా వేరే మూలలో ఉంచితే ఇల్లు క్లీన్‌గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories