Knee Pain: మోకాలి నొప్పిని తట్టుకోలేకపోతున్నారా? ఈ కార్డియో వర్కౌట్స్ ను ట్రై చేయండి..నొప్పి మటుమాయం అవుతుంది

Published : Aug 04, 2022, 02:59 PM IST

Knee Pain: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కార్డియో వర్కౌట్స్ చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు బర్న్ అవడంతో పాటుగా మోకాలి నొప్పులు కూడా తగ్గుతాయి. 

PREV
110
Knee Pain: మోకాలి నొప్పిని తట్టుకోలేకపోతున్నారా? ఈ  కార్డియో వర్కౌట్స్ ను ట్రై చేయండి..నొప్పి మటుమాయం అవుతుంది
knee pain

మోకాలి నొప్పి ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. వయసు పెరిగే కొద్దీ మోకాలి కీలు అరిగిపోవడమే దీని వెనుకున్న ప్రధాన కారణం. కానీ ఈ రోజుల్లో యువకులు, మధ్య వయస్కులు కూడా మోకాలి నొప్పి, మోకాలుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవన శైలే అంటున్నారు నిపుణులు. 

210

విపరీతంగా బరువు పెరగడం వల్ల కూడా మోకాలి నొప్పి కలుగుతుంది. ఈ మోకాలి నొప్పి ఎక్కువ రోజులు అలాగే ఉంటే కూర్చోవడం, నడవడం, మెట్లు ఎక్కడం, దిగడం వంటి చిన్న చిన్న పనులను కూడా చేసుకోలేరు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని కార్డియో వర్కౌట్స్ మోకాలి నొప్పి ఎక్కువ కాకుండా.. ఈ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

 

310
​ ​

ఈత (swimming)

మోకాలి నొప్పితో విలవిలాడే వారు ఈత కొట్టడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. ఈ వ్యాయామం వల్ల మోకాలికి మద్దతునిచ్చే కండరాలు బలంగా మారుతాయి. అంతేకాదు శరీరంలో ఉండే అదనపు కేలరీలు కూడా కరిగిపోతాయి. ఈత కొట్టడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈత కొట్టడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

410

సైక్లింగ్ (Cycling)

సైక్లింగ్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడటమే కాదు.. మోకాళ్ల బలాన్ని కూడా పెంచుతుంది. ఇది మీరెంత వేగంగా తొక్కుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు  ఒక్క 30 నిమిషాలు వేగంగా తొక్కిగే  300 నుంచి 450 కేలరీలు తగ్గుతాయి. సైక్లింగ్ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం స్పష్టం చేసింది. 
 

510

సైక్లింగ్ ను సాయంత్రం వేళ చేస్తే మంచిది. రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల గాఢంగా నిద్రపడుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. స్లీప్ మెడిసిన్ రివ్యూస్ జర్నల్లో ఆ అధ్యయనం ప్రచురితమైంది.
 

610

క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  medicalnewstoday.com ప్రకారం.. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. సైక్లింగ్ మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. 
 

710

వేగంగా నడవడం

ఫాస్ట్ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం మొత్తం కదిలేలా వేగంగా నడవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. 
 

810
walking

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక గంట పాటు నడిస్తే.. బిఎమ్ఐ స్థాయి మెరుగుపడుతుంది. కండరాలు బలంగా మారుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాద జలుబు, తుమ్ములు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

910

స్లీప్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..  మంచి నిద్ర నడక వంటి శారీరక శ్రమతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా శారీరక శ్రమలో.. వేగంగా నడిచే వారు రాత్రిళ్లు ఫాస్ట్ గా నిద్రలోకి జారుకుంటారట. 

1010

పైలేట్స్ (Pilates)

పైలేట్స్ అనేది పూర్తి శరీర వ్యాయామం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. నిర్దిష్ట ప్రాంతాలలో కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ వ్యాయామం శరీరంలోని అనవసరమైన కేలరీలను కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories