ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ మీకు కొత్త కొత్త రోగాలొచ్చే అవకాశం కూడా పెరుగుతున్నట్టే. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ మరీ ఎక్కువైతే గుండెపోటు, అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ, డయాబెటీస్ వంటి ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.