వంట చేసేటప్పుడు గాలిలో నూనె కణాలు, ఆవిరి చుట్టుపక్కల వస్తువులపై పడతాయి. వాటిపై దుమ్ము చేరినప్పుడు జిడ్డు బంకలా పట్టేస్తుంది. అందుకే వంటగదిలోని స్విచ్ బోర్డులు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ పక్కన ఉండే గోడలు, క్యాబినెట్ హ్యాండిల్స్ త్వరగా మురికి అవుతాయి.
ఈ తప్పులు అస్సలు చేయకండి!
• స్విచ్ బోర్డుపై డైరెక్ట్‌గా నీళ్లు చల్లడం
• తడి స్పాంజితో గట్టిగా రుద్దడం
• పవర్ ఆన్‌లో ఉన్నప్పుడు క్లీన్ చేయడం
• పదునైన వస్తువులతో సందుల్లోని మురికిని తీయడం
• కెమికల్ క్లీనర్లను ఎక్కువగా వాడటం
• స్విచ్‌లోకి లిక్విడ్ వెళ్తే వెంటనే పవర్ ఆన్ చేయడం
ఒకవేళ స్విచ్ బోర్డులోకి లిక్విడ్ వెళ్లిందని అనుమానం వస్తే, పవర్ ఆన్ చేయకుండా ఎలక్ట్రీషియన్‌ను పిలవడం మంచిది.