kidney stone: నిమ్మకాయను ఈ విధంగా ఉపయోగిస్తే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి..

Published : Jul 10, 2022, 12:34 PM IST

kidney stone: భారతదేశంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

PREV
15
kidney stone: నిమ్మకాయను ఈ విధంగా ఉపయోగిస్తే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి..

జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. నీళ్లను తక్కువగా తాగే వారు కూడా ఈ సమస్య బారిన పడతారు. మూత్రపిండాల్లో రాళ్లు చిన్నగా ఉంటే పెద్దగా సమస్య ఏం ఉండదు. కానీ ఇవి పెద్దగా అయితేనే విపరీతమైన నొప్పి పుడుతుంది. దీన్ని భరించడం కష్టంగా ఉంటుంది.

25

అయితే కొంత మంది వ్యక్తులో ఈ రాళ్లు వాటంతట అవే బయటకు వెళతాయి. కానీ కొంతమంది మాత్రం చికిత్సను తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాళ్లు మెడిసిన్స్ తోనే కాకుండా నిమ్మకాయతో కూడా తగ్గించుకోవచ్చు. అందుకోసం నిమ్మను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35


నిమ్మకాయ, తులసి

నిమ్మలో సిట్రిక్ ఆమ్లం ఉంటే.. తులసిలో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఈ రెండు ఆమ్లాలు మూత్రపిండాల్లో రాళ్లను విచ్చిన్నం చేస్తాయి. ఇవి రాళ్ల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలిగించి.. రాళ్లను మాత్రం ద్వారా బయటకు పంపేందుకు దోహదపడతాయి. ఇందుకోసం ప్రతిరోజు ఉదయం పూట మూత్రవిసర్జన చేసేకంటే ముందుగానే టీ స్పూన్ చొప్పున నిమ్మరసం, తులసి రసం తాగాలి. 
 

45

నిమ్మకాయ, ఆపిల్ వెనిగర్

కిడ్నీల్లో ఉండే రాళ్లలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అయితే నిమ్మలో ఉండే సిట్రేట్ గుణాల వల్ల రాళ్లు విచ్ఛిన్నం అవతాయి. అలాగే ఆపిల్ వెనిగర్ లో రాళ్లను కరిగించే గుణాలుంటాయి. ఇందుకోసం గ్లాస్ నీటిలో అరటీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ ఆపిల్ ను వెనిగర్ ను వేసి బాగా పలిపి తాగాలి. దీంతో రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తాయి. 
 

55

నిమ్మకాయ, పుదీనా

నిమ్మరసం, పుదీనా రసాల్లో మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే ఔషద గుణాలుంటాయి. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకుని రసం తీసి గ్లాస్ నీటిలో కలపండి. అందులోనే టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా మిక్స్ చేసి తాగండి. ఇది రాళ్ల వల్ల  కలినే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాళ్లను కూడా కరిగిస్తుంది. ఈ మూడు పద్దతుల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. ఈ పద్దతులు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories