ఈ వ్యాధులున్న వారు కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

First Published Dec 24, 2022, 2:02 PM IST

మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు వ్యాధులు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి, మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. డయాబెటీస్ ను నియంత్రించకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీనివల్ల మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. 
 

మన శరీరంలో మూత్రపిండాలు చేసే పనులు చాలా ముఖ్యమైనవి. మూత్రపిండాల ఆరోగ్యం మన రోజువారీ జీవితాలను ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. కాగా ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీని లక్షణాలను గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. అలాగే మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు మూత్రపిండాల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎందుకంటే సమస్యలు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. డయాబెటిస్ ను నియంత్రించకపోతే..  రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది ఇలాగే స్థిరంగా ఉంటే మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. 
 

అధిక రక్తపోటు మూత్రపిండాలను బాగా దెబ్బతీస్తుంది. అలాగే మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే డాక్టర్ సిఫారసు చేసిన మందులను ఖచ్చితంగా వేసుకోవాలి. ఉప్పు, ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వంటి సాధారణ జీవనశైలి మార్పులను చేసుకోవాలి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి హార్మోన్ల అసమతుల్యత,  అనారోగ్యం లేదా ఒత్తిడితో సహా కారకాలు దారితీస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మూత్రపిండాలలోని రక్త నాళాలు దగ్గరకు అవుతాయి. ఒక్కోసారి అవి మూసుకుపోవచ్చు. అలాగే రక్త నాళాలకు నష్టం కలుగుతుంది. అలాగే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. 
 

మీకు డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉంటే.. మీ మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉండాలంటే రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. మీ రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. 

kidney

ఈ సమస్యలున్న వారు రోజుకు ఖచ్చితంగా రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. మూత్రపిండాల నుంచి సోడియం,  విషాన్ని తొలగించడంలో నీళ్లు సహాయపడతాయి. రోజుకు కనీసం 1.5 నుంచి 2 లీటర్ల నీటిని తాగొచ్చు. 

kidney

ధూమపానం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరంలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. స్మోకింగ్ వల్ల రక్త ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. దీంతో మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ధూమపానం మూత్రపిండాల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే స్మోకింగ్ చేయడం మానేయండి. దీంతో మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

click me!