
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాల్లో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని, రక్తంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. మన శరీరంలో ఉన్న అవయవాలు దెబ్బతింటే వాటిని రిపేర్ చేయొచ్చు.. ఒక్క మూత్రపిండాలను తప్ప. అలాంటి వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇండియాలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి సంఖ్య దశాబ్ద కాలంలో రెట్టింపు అయ్యిందని పలు సర్వేలు చెబుతున్నాయి. వయోజనులలో 8 నుంచి 10 శాతం మంది ఏదో ఒక మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారట.
ఈ మూత్రపిండాల సమస్యలు రావడానికి అధిక రక్తపోటు, డయాబెటీస్ ప్రధాన కారకాలుగా ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే స్మోకింగ్, ఊబకాయం, లింగ్, genetic, వయస్సు వంటివి కూడా మూత్రపిండాల సమస్యను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో భాదపడేవారు మంచి జీవన శైలిని, ఆరోగ్యకరమైన ఆహారాను తీసుకోవాలని చెబుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాబేజి (Cabbage)
క్యాబేజీలో ఖనిజాలు, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, కరగని ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాబేజీలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువ మొత్తంలో ఉంటాయి. మొత్తంలో మూత్రపిండాల రోగాలతో బాధపడేవారికి క్యాబేజీ దివ్య ఔషదంగా పనిచేస్తుంది.
కాలీఫ్లవర్ (Cauliflower)
కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ బి ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన కాలీఫ్లవర్ ను తీసుకుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీన్ని సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఉడికించిన కాలీఫ్లవర్ లో సోడియం 19 మి.గ్రాములుంటే, భాస్వరం 40 మి.గ్రా, పొటాషియం 176 మి.గ్రాములు ఉంటాయి.
వెల్లుల్లి (Garlic)
మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఉప్పుతో పాటుగా సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. వంటల్లో వీటిని వేయడం వల్ల కూరలు చాలా టేస్టీగా అవుతాయి. 9 గ్రాముల వెల్లుల్లిలో సోడియం 1.5 మి.గ్రా, భాస్వరం 14 మి.గ్రా, పొటాషియం 36 మి.గ్రాములు ఉంటాయి.
ఎర్ర ద్రాక్ష (Red grapes)
తియ్యగా ఉండే ఈ పండర్లలో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 75 గ్రాముల ఎర్ర ద్రాక్షల్లో పొటాషియం 144 మి.గ్రా, సోడియం 1.5 మి.గ్రా, భాస్వరం 15 మి.గ్రాములు ఉంటాయి. వీటిని అలాగే తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
గుడ్డులోని తెల్లసొన (Egg whites)
గుడ్డులోని తెల సొన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. డయాలసిస్ చికిత్స చేయించుకున్నవారికి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. 66 గ్రాముల తెల్లసొనలో పొటాషియం 108 మి.గ్రా, సోడియం 110 మి.గ్రా, భాస్వరం 10 మి.గ్రా ఉంటాయి. ఆమ్లేట్ వేసుకున్నా.. శాండ్ విచ్ లు చేసుకుని తిన్నా తెల్లసొననే ఉపయోగించండి. ఉడకబెట్టిన గుడ్లను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.