పీరియడ్స్ టైంలో చాక్లెట్లను తింటే ఎంత మంచిదో తెలుసా..?

Published : Jan 19, 2023, 03:57 PM IST

చాక్లెట్లను తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్లలో సెరోటోనిన్ అనే యాటి డిప్రసెంట్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. నెలసరి తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది.  

PREV
18
 పీరియడ్స్ టైంలో చాక్లెట్లను తింటే ఎంత మంచిదో తెలుసా..?

సౌకర్యవంతమైన ఆహారాన్ని తినాలనిపిస్తుందంటే.. మీ నెలసరి దగ్గరకొస్తుందని అర్థం. అవును పీరియడ్స్ దగ్గరకొచ్చే సమయంలో కొన్ని రకాల ఆహారాలను తినాలన్న కోరికలు పుడతాయి. ఎందుకంటే మీ శరీరానికి ఆ సమయంలో ఎక్కువ కేలరీలు అవసరం. ముఖ్యంగా చాక్లెట్, కేక్, స్వీట్లు వంటి తీపి ఆహారాలనే ఎక్కువగా తినాలనిపిస్తుందని ఎన్సిబిఐ అధ్యయనం కనుగొంది.
 

28

నెలసరిలో రుతుస్రావం తిమ్మిరి కూడా బాధిస్తుంది. కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి, ఒంటి నొప్పులు ఉంటాయి. ఈ నెలసరి వల్ల రోజు వారి పనులను కూడా చేసుకోలేరు. ఈ సమయాల్లో మహిళలు నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అయితే  ఈ నొప్పిని తగ్గించడంలో కంఫర్ట్ ఫుడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది మహిళలకు ప్రశాంతతను కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువగా కోరుకునే ఆహారాలలో చాక్లెట్ ఒకటి.  ముఖ్యంగా డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే దీనిలో ఎక్కువ కోకో బీన్స్ ఉంటాయి. ఇది ఫ్లేవనాయిడ్లకు గొప్ప మూలం. దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. 

38

చాక్లెట్లు, పీరియడ్స్

పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు సౌకర్యాన్ని అందించే ఆహారాన్ని కోరుకునేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో చాక్లెట్ కోసం ఆరాటపడుతుంటారు. ఎన్సిబిఐ అధ్యయనం ప్రకారం.. కళాశాలలో 28.9% మంది మహిళలు వారి పీరియడ్స్ సమయంలో చాక్లెట్ కోసం ఆరాటపడుతున్నారని నివేదించారు. ఇది సాధారణంగా  పీరియడ్స్ కు 4 రోజుల ముందు ప్రారంభమవుతుంది. రుతుస్రావం వరకు ఉంటుందట.

48

అండోత్సర్గము ప్రారంభమైనప్పుడు.. వారి ఇన్సులిన్ స్థాయిలు పెరిగే కొద్దీ ఫీల్ గుడ్ హార్మోన్ సెరోటోనిన్ తగ్గుతుంది. ఫలితంగా మానసిక స్థితిని పెంచే చాక్లెట్ వంటి ఆహారాలను తినాలన్న కోరికలు పెరుగుతాయి. అలాగే ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది కంఫర్ట్ ఫుడ్. ముఖ్యంగా ఇది స్వీట్ల కోరికను పెంచుతుంది. 
 

58

నిజానికి డార్క్ చాక్లెట్ పీరియడ్స్ సమస్యలను తగ్గించే సప్లిమెంట్. పీరియడ్స్ పెయిన్ ను తగ్గించడంలో సహాయపడటానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ డార్క్ చాక్లెట్ లో ఉంటాయి. అందుకే పీరియడ్స్ దగ్గరకొచ్చేకొద్దీ వీటిని తినాలన్న కోరిక పెరుగుతుంది. 
 

68

పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

ఎన్సీబీఐ ప్రకారం.. చాక్లెట్ తినడం మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. నిజానికి డార్క్ చాక్లెట్ లో సెరోటోనిన్ అనే యాంటిడిప్రెసెంట్ ఉంటుంది. ఇది ఉత్సాహాన్ని పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లో ఉన్న  ఫ్లేవనోల్స్ మానసిక స్థితిని పెంచడానికి, ఆనందకరమైన అనుభూతిని కలిగించడానికి సహాయపడతాయి. 
 

78

ఒత్తిడిని తగ్గిస్తుంది

పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి కలుగుతుంది. దీనివల్ల ఆడవారు తమ పనులను కూడా చేసుకోలేరు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి సమయంలో డాక్క్ చాక్లెట్ ను తినడం మంచిది. ఎందుకంటే ఇది ఒత్తిడిని కలిగించే  కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 
 

88


పీరియడ్ తిమ్మిరిని తగ్గిస్తుంది

పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు ప్రతి మహిళకు నరకంగానే ఉంటుంది. అయితే డార్క్ చాక్లెట్లు ఈ తిమ్మిరిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్లో ఫినాల్,  ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు, అలాగే పొటాషియం, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు, తక్కువ మొత్తంలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ  ఆమ్లాలు, మెగ్నీషియం కంటెంట్  పుష్కలంగా ఉంటాయి. ఇది మీ కండరాలను నీరు పట్టి ఉంచకుండా.. ఉబ్బినట్టు అనిపించకుండా చేస్తాయి. అలాగే పీరియడ్ తిమ్మిరిని కూడా తగ్గిస్తాయి.


 

Read more Photos on
click me!

Recommended Stories