కిడ్నీ సమస్యలున్న వారు ఈ ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు..

First Published Jan 19, 2023, 3:01 PM IST

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి సోడియం, పొటాషియం, భాస్వరాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఖనిజాలు రక్తప్రవాహంలో ఎక్కువగా వల్ల వాటిని తగినంతగా ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. 
 

మూత్రపిండాలు మన రక్తంలోని మలినాలను తొలగించడంతో సహా  ఎన్నో పనులను చేస్తుంది. కాగా ఈ రోజుల్లో చాలా మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అయితే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి కాలక్రమేనా గుండె జబ్బులతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి సోడియం, పొటాషియం, భాస్వరం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ఎందుకంటే రక్తప్రవాహంలో ఈ ఖనిజాలు ఎక్కువగా ఉంటే వాటిని తగినంతగా ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. 

నిజానికి మూత్రపిండాల వ్యాధిని సకాలంలో గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ చాలా మంది మూత్రపిండాల వ్యాధిని అస్సలు గుర్తించరు. ఎందుకంటే ఈ వ్యాధి మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ వ్యాధి ముదిరాకనే లక్షణాలు కనిపిస్తాయి. మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉన్నా లేదా మూత్రపిండాల ఆరోగ్యం బాగాలేకపోయిన వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అలాగే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. అప్పుడే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంతకీ కిడ్నీ పేషెంట్లు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలంటే.. 

అవొకాడో

అవోకాడోలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. కానీ మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు మాత్రం వీటిని తినకూడదు. ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. సుమారు 200 గ్రాముల బరువున్న అవోకాడోలో 970 మిల్లీగ్రాముల పొటాషియం ఉండొచ్చు. అందుకే కిడ్నీ పేషెంట్లు వీటిని పొరపాటున కూడా తినకూడదు.
 

bone soup

సూప్

సూప్ లు, సాస్ లతో సహా తయారుగా ఉన్న ఆహారాలలో ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అదనపు సోడియం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో సోడియం పేరుకుపోవడమే కాదు.. రక్తపోటు కూడా పెరిగిపోతుంది. 
 

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రోజువారీ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి అరటిపండ్లు మంచి ఆహారం కాదు. మూత్రపిండాలు సాధారణంగా మీ పొటాషియం స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది.
 

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులో పొటాషియం, భాస్వరం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. అయితే దెబ్బతిన్న మూత్రపిండాలున్న వారు ఇవి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఇవి రక్తంలో పేరుకుపోతాయి. కాల్షియం, భాస్వరం మధ్య అసమతుల్యత ఏర్పడి ఎముకల నుంచి కాల్షియం గ్రహించడానికి కారణమవుతుంది.
 

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ ను తక్కువ మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. కానీ వీటిలో చక్కెర, పొటాషియం లు ఎక్కువగా ఉంటాయి. 200 గ్రాముల ఎండుద్రాక్షలో 493 కేలరీలు ఉంటాయి. మరోవైపు ఒక ఆపిల్  లో 100 కేలరీల కంటే తక్కువ ఉంటుంది.
 

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  అయినప్పటికీ బ్రౌన్ రైస్ లో తెల్ల బియ్యం కంటే పొటాషియం, భాస్వరం లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు వండిన బ్రౌన్ రైస్ లో 150 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 154 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటాయి. మరోవైపు ఒక కప్పు వండిన తెల్ల బియ్యంలో 68 మి.గ్రా భాస్వరం, 55 మి.గ్రా పొటాషియం మాత్రమే ఉంటాయి.

click me!