ఏరికా పామ్ (Erica Palm): ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంటిలో ఏ మూలన అయినా ఈ మొక్కను ఉంచుకోవచ్చు. ఇంటికి ఒక ప్రత్యేకమైన తాజా లుక్ (Fresh look) ను అందిస్తుంది. ఈ మొక్కలు ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఇంటిలో వారికి సంతోషం, ఏ పని చేపట్టిన అభివృద్ధి కలుగుతాయి. కనుక ఇంటి లోపల ఈ మొక్కలను పెంచుకోవడం మంచిది.