పచ్చిమిరప కాడలు
పిండి పాత్రలో 2 నుండి 3 పచ్చిమిరపకాయలను కాడలతో సహా పిండి ఉపరితలంపై ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మిరపకాయల్లో ఉండే సహజ మూలకాలు హానికర బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుని, పిండి త్వరగా పులవకుండా నిరోధిస్తాయి.
పిండి తాజాగా ఉండటానికి మరికొన్ని సులభమైన టిప్స్
పిండి రుబ్బిన వెంటనే ఉప్పు కలపకూడదు. ఇడ్లీలు వేసుకోవడానికి సరిపడా పిండిని పక్కకు తీసుకుని, అప్పుడే ఉప్పు కలుపుకోవడం మంచిది.పిండిని ఎప్పుడూ గాలి చొరబడని (Air-tight) డబ్బాలోనే నిల్వ చేయాలి.
ఒకవేళ పిండి పులిసిపోతే?:
పిండి ఇప్పటికే బాగా పుల్లగా మారి ఉంటే.. అందులో కొద్దిగా పచ్చి పాలు లేదా అర టీస్పూన్ పంచదార కలిపితే ఆ పులుపు తగ్గి ఇడ్లీలు రుచిగా వస్తాయి.
ఈ చిన్న చిన్న పాతకాలపు చిట్కాలను పాటిస్తే ఎలాంటి రసాయనాలు వాడకుండానే వారం రోజుల పాటు మెత్తటి, తాజా ఇడ్లీలను ఆస్వాదించవచ్చు.