Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Published : Aug 29, 2026, 01:24 PM IST

Health Insurance: ప్రస్తుత కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుకోని వైద్య ఖర్చులు మీదపడకూడదంటే ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే పాలసీ తీసుకునే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.

PREV
16
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

సాధారణంగా చాలామంది పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు, కారు కొనడం వంటి భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే కొంత డబ్బు దాచుకుంటూ ఉంటారు. కానీ, వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా పొదుపు చేసేవాళ్లు చాలా తక్కువ. దీంతో ఉన్నట్టుండి అనారోగ్యం వస్తే, చేతిలో డబ్బుల్లేక అప్పులు చేయడమో, నగలు తాకట్టు పెట్టడమో చేస్తుంటారు. అయితే అలాంటి పరిస్థితి రాకూడదంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. రోజు రోజుకీ వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అత్యవసర సమయాల్లో ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అయితే పాలసీ తీసుకునే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ వివరంగా చూద్దాం.

26
వయసు, వైద్య ఖర్చులను బట్టి..

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ వయసు, కుటుంబ సభ్యుల సంఖ్య, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వైద్య ఖర్చులను బట్టి కవరేజ్ ఉండాలి. ప్రతి ఒక్కరికీ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బేసిక్ కవరేజీ ఉండాలి.

ఉద్యోగులు కంపెనీలు ఇచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అనుకోవద్దు. ఎందుకంటే, మీరు ఉద్యోగం మారినా లేదా కోల్పోయినా ఆ ఇన్సూరెన్స్ కవరేజీ ఆగిపోతుంది. అందుకే, సొంతంగా ఒక పాలసీ తీసుకోవడం మంచిది.

36
వెయిటింగ్ పీరియడ్

కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో నిర్దిష్ట చికిత్సలకు పరిమితులు ఉండొచ్చు. అలాగే, పాలసీ తీసుకునే ముందు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని స్పష్టంగా చెప్పాలి. ఆల్రెడీ ఉన్న వ్యాధులకు చికిత్స పొందాలంటే కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో పాలసీ తీసుకునే ముందే స్పష్టంగా తెలుసుకోవాలి.

46
నెట్ వర్క్ హాస్పిటల్స్ లిస్ట్

మీరు పాలసీ తీసుకునే ముందే, మీ ఏరియాలోని ముఖ్యమైన హాస్పిటల్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ 'నెట్‌వర్క్ హాస్పిటల్స్' లిస్ట్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, అత్యవసర సమయంలో దగ్గర్లో హాస్పిటల్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే, ఆ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సౌకర్యం ఉందో లేదో కూడా చూసుకోవాలి.

56
క్లెయిమ్ డేటా..

క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో మాత్రమే కాదు, క్లెయిమ్ డేటా, రిజెక్షన్ కారణాలు, కస్టమర్ సర్వీస్ వంటివి కూడా పోల్చి చూడాలి. ఇందులో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎక్కువగా ఉంటే మంచిది.

రూమ్ రెంట్ లిమిట్?

కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో హాస్పిటల్ రూమ్ రెంట్‌పై రోజువారీ పరిమితి ఉంటుంది. దీనివల్ల, క్లెయిమ్ అయ్యే మొత్తంలో కోత పడొచ్చు. వీలైనంత వరకు రూమ్ రెంట్ క్యాప్ లేని పాలసీని ఎంచుకోవడం మంచిది.

వ్యాధులపై సబ్-లిమిట్

కంటిశుక్లం, మోకాలి మార్పిడి ఆపరేషన్ వంటి నిర్దిష్ట చికిత్సలకు ఏమైనా సబ్-లిమిట్స్ ఉన్నాయో లేదో చూడాలి.

కో-పేమెంట్

పాలసీలో కో-పేమెంట్ ఉంటే, వైద్య ఖర్చుల్లో కొంత భాగాన్ని పాలసీ తీసుకున్నవారే చెల్లించాల్సి ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు జీరో కో-పే ఉన్న పాలసీని పోల్చి చూసి ఎంచుకోవడం మంచిది.

66
పాలసీలో కవర్ కాని చికిత్సలు

పాలసీ ఎక్స్‌క్లూజన్స్ గురించి పూర్తిగా చదవాలి. ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవ్వని చికిత్సల గురించి తెలియకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే పాలసీ నిబంధనలకు లోబడిన ఖర్చులకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.

కేవలం ప్రీమియం తక్కువగా ఉందని పాలసీని ఎంచుకోవద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు ప్రీమియం ఎంత అనేదానికంటే, ఎంత కవరేజీ వస్తుంది, ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏవి కవర్ అవ్వవు, మన వంతుగా ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వంటి విషయాలన్నీ పోల్చి చూసి, ఆ తర్వాతే పాలసీ తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories