Beauty tips: మేకప్ వేయాల్సిన అవసరం లేకుండా ముఖం మెరిసిపోవాలంటే చిన్న చిన్న చిట్కాలు ఇంటి దగ్గర పాటిస్తే చాలు. ఖరీదైన ప్రొడక్ట్స్ వాడకుండా, కేవలం 7 రోజుల్లోనే మీ చర్మంలో అద్భుతమైన మార్పు తెచ్చే పనులు ఇవిగో.
అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందంగా ఉండాలంటే ముఖ్యంగా ముఖ చర్మం సహజంగా మెరిసిపోవాలి. మెరిసే చర్మాన్ని పొందడానికి ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా చవక పదార్థాలతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు.
ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి చర్మాన్ని క్లియర్ గా మారుస్తుంది. కేవలం 7 రోజులు ఇలా చేస్తే మీ చర్మం చాలా క్లియర్‌గా మారుతుంది. మొటిమల సమస్య తగ్గి ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
24
సున్నితంగా మసాజ్ చేయాలి
రాత్రి పడుకునే ముందు 3 నుంచి 5 నిమిషాల పాటు ముఖంపై మసాజ్ చేస్తే ఎంతో మంచిది. దీనికోసం మీరు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా కలబంద గుజ్జును ఎంపిక చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.. చర్మం కాంతివంతంగా మారుతుంది.
ముఖం మెరుస్తూ ఉండాలంటే చర్మంపై ఉండే మృతకణాలను తొలగించాలి. దీనికోసం వారానికి రెండుసార్లు మైల్డ్ స్క్రబ్ వాడండి. బియ్యం పిండి, తేనె, రోజ్ వాటర్‌తో ఇంట్లోనే సులభంగా స్క్రబ్ లా వాడుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా మార్చిసహజమైన మెరుపును ఇస్తుంది.
34
ఫేస్ ప్యాక్
ఈ ఏడు రోజుల్లో రెండు లేదా మూడు సార్లు నాచురల్ ఫేస్ ప్యాక్ తయారుచేసి వాడుకోండి. శనగపిండి, పెరుగు, పసుపు, కలబంద గుజ్జు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటూ వదిలేయాలి. తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేశాక మీ చర్మం మృదువుగా మారడం గమనిస్తారు. ట్యాన్ మొత్తం పోతుంది…ముఖానికి ఫ్రెష్ లుక్ ఇస్తుంది.
స్నానం చేసేటప్పుడు వేడి నీటిని నేరుగా ఎప్పుడూ ముఖంపై వేసుకోవద్దు. అది చర్మాన్ని పొడిగా చేస్తుంది. బదులుగా, స్నానం చేశాక 30 సెకన్ల పాటు ఆవిరి పట్టి, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంచ చేసుకోండి. ఇది చర్మ రంధ్రాలు తెరుచుకుని మూసుకునేలా చేస్తుంది. దీనివల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.
మురికిగా ఉన్న తలగడను వాడడం ఏమాత్రం మంచిది కాదు. రాత్రంతా మన ముఖానికి తలగడ తగులుతూ ఉంటుంది. అందుకే ఈ 7 రోజులూ ప్రతి రెండు రోజులకు ఒకసారి తలగడా కవర్ మార్చండి. కాటన్ లేదా సిల్క్ కవర్ అయితే ఇంకా మంచిది. ఇది మొటిమలను తగ్గించి, చర్మాన్ని క్లియర్‌గా ఉంచుతుంది.
రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన తేనెను ముఖానికి రాసి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనె చర్మానికి లోతుగా తేమను అందిస్తుంది. ఇది నాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా కాబట్టి చర్మాన్ని పొడిబారనివ్వకుండా మంచి మెరుపును ఇస్తుంది.