సమ్మతి, నియమాలు: సెషన్ ప్రారంభమయ్యే ముందు రెండు పార్టీలు నియమాలను అంగీకరించాలి. ఎవరైనా ఎప్పుడైనా సెషన్‌ను ఆపవచ్చు.
భద్రత: ఇద్దరి బ్యాగ్రౌండ్ పూర్తిగా వెరిఫై చేస్తారు. ఇద్దరి వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
హార్మోన్ల ప్రభావాలు: మానవ స్పర్శ శరీరంలో 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనిని 'మంచి అనుభూతి' హార్మోన్ అంటారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.
మన దేశంలో ఈ ట్రెండ్ ఇంకా కొత్త అనే చెప్పాలి. కొంతమంది దీనిని 'డేటింగ్' అని తప్పుగా భావిస్తారు. కాబట్టి 'కో-పార్టనర్' వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇది కేవలం వృత్తిపరమైన సేవ అని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది 32-35 సంవత్సరాల వయస్సు గలవారు ఉండటం గమనార్హం.
ప్రయోజనాలు:
ఒంటరితనం నుండి ఉపశమనం. ఆందోళన, ఒత్తిడి , భావోద్వేగ అలసట తగ్గింపు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
ఇలాంటి ట్రెండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఇది తాత్కాలిక పరిష్కారం కావచ్చు, నిజమైన సంబంధాలకు ప్రత్యామ్నాయం కాదు. దానిపై అతిగా ఆధారపడటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది. భారతదేశంలో నకిలీ వెబ్‌సైట్‌ల ముప్పు ఉంది, ముఖ్యంగా మహిళలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతేకాదు.. మీకు ఏదైనా కష్టం, బాధ వస్తే.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాటిని పంచుకోవడానికి ప్రయత్నించాలి అని నిపుణులు అంటున్నారు.